Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

సహాయ పునరావాస కార్యక్రమాలు సమర్ధవంతంగా సాగాలి…

కలెక్టరేట్ లో 18002331077 నెంబరుతో కంట్రోల్ రూమ్…

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

విశాలాంధ్ర -ఏలూరు: గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా అధికారులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మరింత అప్రమత్తం చేశారు.శనివారం ఏలూరు నుంచి వరద సహాయ పునరావాస కార్యక్రమాల విధుల్లో ఉన్న జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంధ్రన్, ఐటిడిఏ పివో, ఆర్డివోలు, డిపివో, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ, డియంఅండ్ హెచ్ ఓ,డి ఆర్ డి ఎ పిడి,ఇతర ప్రత్యేకాధికారులు, సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వరద పరిస్ధితిపై ప్రత్యేకంగా సమీక్షించారు.
వరద ప్రబావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు అత్యంత సమర్ధవంతంగా సాగాలన్నారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గోదావరి వరద ఉధృతి నేపధ్యంలో బాధితులకు అందుబాటులో ఉంటూ ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి ఇంకా పెరిగితే ముంపుకు గురయ్యే ప్రాంతాల కుటుంబాలను కూడా ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి భోజన ఏర్పాట్లు చేయడంతోపాటు ఎవరైతే ఇళ్లదగ్గర ఉన్నారో వారికి నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. వేలేరుపాడు మండలానికి జాయింట్ కలెక్టర్, కుక్కునూరు మండలానికి ఐటిడిఏ ఇంఛార్జి పివో పర్యవేక్షకులుగా ఉంటారన్నారు. ప్రతి పునరావాస కేంద్రానికి నియమించిన ఇంఛార్జిలు ఎలా పనిచేస్తున్నదీ కలెక్టర్ వాకాబు చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంధ్రన్ ఆధ్వర్యంలో ఏడున్నర కిలోలు గల 15 వందలు కూరగాయల కిట్లను సిద్దం చేశారన్నారు. కూరగాయల కిట్లను ప్యాకింగ్ చేసేందుకు అందుబాటులో ఉన్న డ్వాక్రా సభ్యులను సిద్దంగా ఉంచుకోవాలని డిఆర్ డిఏ పిడిని కలెక్టర్ ఆదేశించారు. శనివారం రాత్రి విద్యుత్ సరఫరా విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రభావ మండలాల్లో ఎక్కడైనా రోడ్లకు గండ్లు పడితే వెంటనే వాటిని పూడ్చివేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాల్లో అవసరమైన మేర మందులను అందుబాటులో ఉంచాలని డియంహెచ్ఓను ఆదేశించారు. పాముకాటు విరుగుడు మందులను కూడా సిద్దంగా ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాలకు వరద ప్రభావిత గ్రామాలకు రక్షిత నీటి సరఫరా, మంచినీటి వనరుల పునరుద్ధరణ నిర్వహణా చర్యలను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఇ ని కలెక్టర్ ఆదేశించారు. దీనిపై ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఇ సత్యనారాయణ మాట్లాడుతూ వేలేరుపాడులో మంచినీటి సరఫరాకు సంబంధించి అన్ని చర్యలు తీసుకువ్నామని ముంపుకు గురైన గ్రామాలకు నిత్యావసర వస్తువులతోపాటు వాటర్ ప్యాకెట్లను బోట్ల ద్వారా పంపుతున్నామని వివరించారు. కుక్కునూరుకు సంబంధించి దాచారం, కెవ్వాక, మర్రిపాడు, పులపగూడెం, ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పునరావాస కేంద్రాల్లో అవసరమైనమేర వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడమే కాకుండా తమ ఆదేశాలు మేరకు ఇటీవల హ్యాండ్ బోర్లను కూడా ఏర్పాటుచేశామన్నారు. దాచారం కాలనీల్లో మరిన్ని టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. దాచారం గ్రామంలో ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని డిపివోలు కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు డిపిఓ టి. శ్రీనివాస విశ్వవాధ్ మాట్లాడుతూ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకోసం 225 శానిటేషన్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. దాచారం, కెవ్వాక, మర్రిపాడు, పులపగూడెం ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భూదేవిపేట, శివకాశీపురంలో యంపిపి స్కూలు, చర్చిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కూడా శానిటేషన్ కార్యక్రమాలకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్న 6 మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు నీటితో నింపడం జరుగుతుందన్నారు. ఇందుకు విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడం జరిగిందన్నారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన వాహనాలను డిటిసి ద్వారా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తమ ఆదేశాలు మేరకు పునరావాస కేంద్రాలు, వరద ప్రభావిత గ్రామాల్లో దోమల బెడద లేకుండా రాత్రిపూట 22 ఫాగింగ్ యంత్రాల ద్వార ఫాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. పునరావాస శిబిరాలనుంచి వెళ్లేటప్పుడు ఆయా కుటుంబాలకు రూ. 2 వేలు, వ్యక్తులకు వెయ్యి రూపాయలు అందచేయవలసి ఉంటుందని ఈ దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి వివరాలు పొందుపరిచేందుకు రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img