ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు
విశాలాంధ్ర – ధర్మవరం : వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రాణం పోకుండా పునర్జన్మను ప్రసాదించే వారే వైద్యులు అని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షులు గట్టు నాగరత్న, కార్యదర్శి ఆదిలక్ష్మి, కోశాధికారి భాగ్యలక్ష్మి, ఐ ఎస్ ఓ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం డాక్టర్స్ డే సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని సూపర్డెంట్ డాక్టర్ నజీర్, డాక్టర్ పద్మలత తో పాటు 12 మంది వైద్యులను, డిసిహెచ్ఎస్. తిపేంద్ర నాయక్, స్పందన ఆసుపత్రి డాక్టర్ సోనియా, దేవి నర్సింగ్ హోమ్. డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ దామోదర్, డాక్టర్ రాజేశ్వరిలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఇన్నర్ వీల్ క్లబ్ వారు మాట్లాడుతూ సేవా మార్గమే వైద్య వృత్తి అయిందని, ఆరోగ్య అవగాహనపై రోగులకు, అన్నివేళలా వైద్య చికిత్సలపై సలహాలు, సూచనలు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. వైద్యులను భగవంతునితో పోల్చుతారని, డాక్టరు అంటే ధైర్యం,దైవం, ఆయువు, సైన్యం అని తెలిపారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ప్రాణం పోసేవారు దేవుడని ఆ ప్రాణం పోకుండా పునర్జన్మను ప్రసాదించేవారు డాక్టర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్బుసభ్యులు పాల్గొన్నారు.