Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

తిరగబడ్డ యమునా నది

గత వారం అంతా ఉత్తరాదిలో అపూర్వమైన రీతిలో అధిక వర్షపాతంవల్ల దిల్లీ నగరంలో జనజీవనానికి విఘాతం కలిగింది. ఈ విపత్తు ఒక్క దిల్లీకే పరిమితం కాలేదు. హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, కొంతమేర ఉత్తర ప్రదేశ్‌ కూడా కుంభ వృష్టి బారిన పడ్డాయి. దిల్లీలో అయితే ఇంత భారీవర్షం కురవడం నలభై ఏళ్ల తరవాత ఇప్పుడే అంటున్నారు. చండీగఢ్‌లో అయితే ఎనిమిది, తొమ్మిది తేదీల్లో 302 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షపాతం ఇదివరకు చూసిన వారే లేరంటున్నారు. ఈ వర్ష బీభత్స ప్రభావం పొరుగున ఉన్న పాకిస్తాన్‌లోనూ కనిపించింది. అక్కడి చీనాబ్‌, సట్లేజ్‌, రావి నదుల్లో నీటిమట్టం అమాంతం పెరిగింది. అక్కడా కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఈ వర్ష బీభత్సంవల్ల దిల్లీతో కలిపితే ఎనిమిది రాష్ట్రాలలో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని ఘరానా వీధులతో పాటు నగరమంతా జలమయమైంది. రాజ్‌ఘాట్‌, ఐ.టి.ఒ.సర్కిల్‌, సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాలూ నీటితో నిండిపోయాయి. రాకపోకలు దాదాపు స్తంభించినంత పనైంది. అందువల్ల అత్యవసర సేవలు అందించవలసిన విభాగాలు తప్ప మిగతా కార్యాలయాలన్నీ మూసివేయవలసి వచ్చింది. కొన్ని సంస్థలు తమ సిబ్బందిని ఇంటిదగ్గర్నుంచే పని చేయమని ఆదేశించాయి. ఇంటిదగ్గర్నుంచే పనిచేసే ప్రయోగానికి కరోనా శ్రీకారం చుట్టింది. మామూలుగా అయితే దేశ రాజధాని దిల్లీలో యమునా నది అక్కడక్కడ చిన్న పాయలుగానో, కొన్ని చోట్ల ఇసక పర్రల్లాగానో కనిపిస్తుంది. కానీ వర్ష తీవ్రతవల్ల దాదాపు గత వారం రోజులనుంచి మహోగ్ర రూపం దాల్చింది. యమునానది ప్రమాద సూచిక 205.33 మీటర్లైతే అది 208.66 మీటర్లకు చేరింది. శుక్రవారం నాటికి యమునా నదిలో వరద ఉధృతి తగ్గినా దిల్లీలోని పల్లపు ప్రాంతాలు ఇంకా చెరువులను తలపిస్తున్నాయి. హతినీకుండ్‌ బ్యారేజీ దగ్గర హర్యానా నీరు విడుదల చేయడం కూడా యమునలో నీటిమట్టం పెరగడానికి కారణమైంది. ఇంద్రప్రస్థ దగ్గర దిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ వ్యవస్థ పాడైపోవడంవల్ల మధ్య దిల్లీలోని సుప్రీంకోర్టు పరిసరాలు కూడా నీట మునిగాయి. అయితే ఈ వ్యవస్థను సత్వరం బాగు చేయడం మెచ్చుకోదగిన చర్యే. గోవులనే కాదు నదులనూ పూజించే దేశం మనది. కానీ నదులను మనం దుర్వినియోగం చేసినట్టుగా మరెక్కడా చేయరేమో! పట్టణీకరణ అత్యంత వేగవంతంగా పెరుగుతూ ఉండడం, జనాభా విస్ఫోటనం కారణంగా ప్రకృతి వనరులను అతిగా వినియోగించు కోవడంవల్ల అప్పుడప్పుడూ ప్రకృతి శక్తులు విజృంభించి జనజీవనాన్ని దుర్భరం చేస్తున్నాయి. ప్రకృతి నియమాలను, క్రమాన్ని అతిగా దుర్వినియోగం చేసినందువల్ల ఈ విపత్తులు అనివార్యమే అవుతాయి. పట్టణాల మీద జనభారం ఎంతగా పెరిగిపోతోందంటే ఉన్న మౌలిక వనరులు పెరిగే జనాభా వనరులను తీర్చడానికి సరిపోయేంతగా లేవు. ప్రకృతి ప్రకోపించినప్పుడు ఈ వ్యవస్థలూ కుదేలైపోతాయి. నగరాల్లో వరద నియంత్రణా వ్యవస్థలు నామ మాత్రమే. వర్షం కురిసినప్పుడల్లా నగర జీవితం నరకప్రాయం అవుతోంది. వీధులు నదులుగా మారుతుంటాయి. ఇళ్లు చిన్న చిన్న దీవులుగా కనిపిస్తాయి. రోజువారీ జీవితం స్తంభిస్తుంది. దిల్లీ, గూర్గాం, ముంబైలాంటి నగరాల్లో ఈ కష్టాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితాలను అల్లకల్లోలం చేసిన సందర్భాలు ఎన్నైనా కనిపిస్తాయి. తన అవసరాలకోసం, మనుగడ కోసం, పురోభివృద్ధికోసం, నాగరికతాభివృద్ధికోసం మనిషి ప్రకృతిని తనకు అనువుగా మలుచుకునే క్రమంలో ప్రకృతిని లొంగదీయాలను కుంటాడు. ఈ క్రమంలో ప్రకృతి విధ్వంసం జరిగిపోతుంది. ఈ విధ్వంసం కడకు మనిషి అస్తిత్వానికే ముప్పు కలిగించవచ్చు. మన నగరాల్లో వరదలు రావడానికి అనేక కారణాలున్నాయి. అవి పొరుగున ఉన్న నదుల్లో, బ్యారేజీల్లో, జలాశయాల్లో జలప్రవాహం పెరగడమూ కావచ్చు. లేదా వివిధ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు సవ్యంగా పనిచేయకనూ పోవచ్చు. నగరాలకు ఎగువన భారీవర్షాలు కురిస్తే దిగువన ఉన్న నగరాలు విపత్తులో పడిపోతాయి. వాన నీటికోసం కొన్ని నగరాల్లో ఇదివరకు నిర్మించిన వ్యవస్థలు ఇప్పుడు ఆనవాలు లేకుండా పోయాయి. అవన్నీ దురాక్రమణలకు గురైనాయి. మన నగరాల విస్తరణకు నియతమైన నియమాలు ఉన్నట్టు కనిపించదు. సహజమైన నీటిప్రవాహ మార్గాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించినందువల్ల ఆ నీటి ప్రవాహం దారిమళ్లి మరోచోట ప్రమాదానికి దారితీయక తప్పదు. దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి వల్ల ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చు. కానీ ప్రకృతి విలయ తాండవం చేసినప్పుడు ఈ నగరాలన్నీ అల్లాడిపోయేవే. సహాయక చర్యలు చేపట్టే బృందాలు వీధుల్లో పడవల మీద వెళ్లడం చూస్తూనే ఉన్నాం. భవన నిర్మాణాలు శ్రుతి మించినందువల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీనివల్ల రోడ్లమీద నిలవ ఉండిపోతాయి.
చట్ట వ్యతిరేక నిర్మాణాలను అరికట్టడం, సహజంగా నీటిపారుదలకు మునుపు ఉన్న మార్గాలకు అవాంతరాలు తొలగించడం, భూ వినియోగ పద్ధతిలో మార్పులు తీసుకురావడం, పట్టణాలకు వలసలను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాలలో సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెంచడానికి తగిన ఏర్పాట్లు చేయడంవల్ల ఈ విపత్తులను నివారించవచ్చు. ఇవన్నీ చేయాలంటే దృఢమైన రాజకీయ సంకల్ప బలంకావాలి. కొరతల్లా దానిదే. భౌగోళిక పరిస్థితులకు అనువుగా నగరాలను దిద్ది తీర్చడం మీద శ్రద్ధేలేదు. మురుగునీటి పారుదల వ్యవస్థ చాలాచోట్ల ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. వ్యర్థపదార్థాలను ఏం చేయాలో తెలియని పరిస్థితి. మడ అడవులు నిత్యం ధ్వంసం అయిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతాలలో వెలసిన నగరాలకు ప్రకృతి విపత్తులు మరీ ఎక్కువ. ఆ నగరాల్లో వరదలు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కోవడం కష్టమే. ఇలాంటి వరదలవల్ల జనం, ముఖ్యంగా పేదలు నిర్వాసితులు కావడం, మౌలిక సదుపాయాలు ధ్వంసం అయిపోవడం, ఆర్థిక నష్టాలు, రవాణా సమస్యలు విపత్తుల ముప్పును మరింతగా పెంచుతాయి. నదీ జలాలకు చోటులేకుండా చేసినప్పుడు ఆ నీరు పొంగి పొర్లుతుంది. అక్కడా ఇళ్లు కట్టేసినందువల్ల నదులు తమ ప్రవాహ ఉద్ధృతిలో వాటినీ కబళిస్తాయి. ఇది ఇటీవల ఎదురవుతున్న ప్రమాదంకాదు. ఒక్క దిల్లీ ఉదాహరణే తీసుకుంటే 17వ శతాబ్దంలోనే యమునా నది ఒడ్డుననే ఎర్రకోట నిర్మించారు. బ్రిటిష్‌ వారు ఆ తరవాత సివిల్‌ లైన్స్‌ ఏర్పాటుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత యమునా నది ప్రవహించే ప్రాంతాన్ని బలాదూరుగా కుంచింపచేశాం. యమునా బాంక్‌ మెట్రో స్టేషన్‌, అక్షర ధాం, కామన్వెల్త్‌ గ్రామం లాంటివన్నీ యమునా నది సహజ ప్రవాహ దిశను అడ్డుకున్నవే. అక్రమ నిర్మాణాలకు లెక్కే లేదు. యమునా నది ప్రవాహ ప్రాంతం ఇదివరకు 5 నుంచి 10 కి.మీ. మేర ఉండేది. ఇప్పుడది కొన్ని చోట్ల కొన్ని మీటర్లకే పరిమితమైంది. నది ప్రవాహ మార్గాన్ని అడ్డుకుంటే అదీ బాహువులు చాచి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకుంటుందిగా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img