Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఏపీలో మరో మూడు రోజులపాటు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఎల్లుండి మరో ఆవర్తనం.. 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు వాతావరణశాఖ అధికారులు.నైరుతి రుతుపవనాల కారణంగా కోస్తాతో పాటు సీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా.. ఉత్తరాంధ్రలో రెండు, మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. కామవరం దగ్గర గుబ్బల మంగమ్మ గుడి రహదారి మూసివేశారు అధికారులు. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే సీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరించారు. అయితే.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు మందగించాయి. చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో.. వర్షాలు కురవాలంటూ జనం పూజలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో గ్రామ దేవతలకు పూజలు చేశారు. బాజా భజంత్రీలతో జలాభిషేకాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img