Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జాతీయ సాఫ్ట్ బాల్ రాష్ట్ర పురుషుల, మహిళల జట్ల ఎంపిక

విశాలాంధ్ర- రాప్తాడు : గోవాలో సెప్టెంబరులో జరగనున్న 37వ జాతీయ క్రీడలలో పాల్గొనే ఏపీ రాష్ట్ర పురుషుల, మహిళల సాఫ్ట్ బాల్ జట్లు ఎంపిక పోటీలను సోమవారం అనంతపురం ఆర్డీటీ క్రీడామైదానంలో నిర్వహించగా 13 జిల్లాల నుండి ప్రతిభ ఉన్న 150మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఎంపికలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ నుండి అబ్జర్వరుగా అనంతపురం చీఫ్ కోచ్ కె.నరసింహారెడ్డి హాజరుకాగా ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ సీఈఓ సి.వెంకటేసులు ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని, గెలుపొందిన క్రీడాకారులకు ఇచ్చే పారితోషకంలో వ్యక్తిగత పతకము సాధించిన క్రీడాకారులతో సమానంగా టీం ఈవెంట్లో పతకము సాధించిన క్రీడాకారులకు కూడా సమానంగా పారితోషకం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని త్వరలోనే ఆచరణలోనికి వస్తుందన్నారు. తెలియజేశారు. టీం ఈవెంట్లలో ఏపీ రాష్ట్రానికి పథకం కచ్చితంగా సాధించే క్రీడలలో సాఫ్ట్బాల్ క్రీడ ముందు వరుసలో ఉంటుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో సాఫ్ట్బాల్ క్రీడాకారులు ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించారని, అసోసియేషన్ ప్రతినిధులు ఎంతో కష్టపడితే ఈ క్రీడ అభివృద్ధి చెందిందని మీరు కూడా నిబద్ధతతో కష్టపడితే ఈ 37వ జాతీయ క్రీడల్లో కచ్చితంగా పతకముతో తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సి.నాగేంద్ర, పీడీలు రామకృష్ణ, కేశవమూర్తి, బొగ్గు ప్రభాకర్, గోపాల్ రెడ్డి, పక్కీరప్ప, లతా దేవి, చంద్ర, వివిధ జిల్లాల అసోసియేషన్ కార్యదర్శులు పి.నరసింహారెడ్డి, ప్రసాద్, రాంభూపాల్ రెడ్డి, గంగులయ్య, విజయ్, కోచ్ లు బద్రి, సాయి, ఓబిలేసు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img