London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాదు ఇది దగా ప్రభుత్వం…

16 రకాల రైతు కార్యక్రమాలు శుద్ద అబద్ధపు మాటలు…

రైతులను తీవ్ర సంక్షోభంలో నెట్టుతున్న జగన్

రైతుల ను బీమా పేరుతో మోసం చేస్తున్న జగన్. పంటల బీమా లో వైసిపి నాయకుల చేతివాటం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గంలో 16 రకాల కార్యక్రమాలు రైతుల కోసం చేస్తున్నామని చెప్పడం శుద్ధ అబద్ధం . రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి రైతులను మోసం చేస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ విమర్శించారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం రైతు సంఘం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాన్ని రైతు సంఘం నియోజవర్గం కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన వహించారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్, టిడిపి నాయకులు మల్లికార్జున, రైతు సంఘం నాయకులు మందలప్ప, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి,సిపిఐ నియోజవర్గం సహయ కార్యదర్శి బి.మహేష్ ,సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్,సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ ఎం డి గౌస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ… జగన్ కళ్యాణదుర్గానికి వచ్చి 16 రకాల నిర్ణయాలు అమలు చేస్తున్నానని చెప్పారు.రైతు బరోస ప్రతి ఏడాదికి ఇస్తున్నామని అన్నారు. భీమా కూడా ఇస్తున్నమని చెప్పారు.ఆర్బికేలో ఎరువులు,వ్యవసాయ విత్తనాలు,వ్యవసాయ పనిమూట్లు ఇస్తున్నామని సబ్సిడీ కింద విత్తనాలు ఇస్తున్నామన్నారు.గొప్పలు చెప్పుకున్నారు.గిట్టుబాటు దర కల్పించి రైతుల వద్ద నుండి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నామన్నారు.ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు. 7500 రైతులకు ఇస్తున్నామన్నారు.ఆర్బికేలో అన్ని ఉన్నాయని సభలో చెప్పుకొచ్చారు.అయితే సీపీఐ రైతు సంఘం ఆధ్వర్యంలో తాము చేసిన పరిశీలనలో ఆర్బికేలో ఒక ఉద్యోగి మాత్రమే ఉంటాడని వేరుసనగలు మాత్రమే ఉన్నాయన్నారు.ఆ వేరు సనగ కాయలు కూడా రైతులు ఎవరు తీసుకోవడం లేదన్నారు.నాణ్యతలేని వేరుశనగలు రైతులకు ఇస్తున్నారని అన్నారు. పంటలు పండక పోవడానికి కారణాలు నాసిరకం వేరుశెనగని సైంటిస్టులతో టెస్టింగ్ చేయకుండా వేరుశనగను పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. కళ్యాణదుర్గంలో బహిరంగ సభలో జగన్ చెప్పిన మాటలు శుద్ధ అబద్ధపు మాటలని విమర్శించారు. గత ప్రభుత్వంలో సూక్ష్మ పోషకాలు ఉచితంగా రైతులకు ఇచ్చేవారని, సబ్సిడీతో ప్రభుత్వ సైంటిస్టులతో పరిశీలించిన విత్తనాలు మాత్రమే రైతులకు ఇచ్చేవారని ప్రస్తుత ప్రభుత్వం టెస్టింగ్ లేని కాంట్రాక్టర్లు పరిశీలించి ఇస్తున్న నాణ్యతలేని నాసిరకం విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ సైంటిస్టులతో విత్తనాలు పరిశీలించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లు కేటాయించినట్లు చెబుతున్నారని, ఎక్కడ రైతులకు స్తీరి
కరణ నిధి ఉపయోగపడిందో, తెలపాలని అన్నారు.ప్రభుత్వానికి రైతులు ధాన్యం అమ్మాలంటే ఏ ఒక్క రైతు కూడా అమ్మడం లేదని అన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర సరిగా ఇవ్వడం లేదు, పైగా రైతులకు సొమ్ము చెల్లించే దాంట్లో జాప్యం చేస్తా ఉన్నారు కాబట్టి రైతులు అమ్మడం లేదన్నారు. ధర సిరీకర నిధి శుద్ద బోగస్ అని ప్రశ్నించారు.తెలంగాణలో ఎకరాకి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అన్ని పదివేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు. ఉచిత కరెంటు తీసేసి మీటర్లు పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సున్నా వడ్డీకే అప్పు ఇస్తున్నానని అంటున్నాడు. అది కూడా ఒక సంవత్సరం లోపు కడితే బ్యాంకు సిబ్బంది రెన్యువల్ చేస్తున్నారని ప్రశ్నించారు.జగన్మోహన్ రెడ్డి వచ్చాక పంటలు పూర్తిగా నాశనమైపోతున్నాయని పంటలు కొట్టుకుపోతున్నాయని విమర్శించారు.దేశంలో గతంలో ఏడో స్థానంలో ఉన్న రైతు ఆత్మహత్యల గణాంకాలు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉందని అన్నారు.దేశంలోనే రైతులు వలసల పోతున్న రాష్ట్రలలో మొదటి రాష్ట్రం ఆంధ్రానే ఉందని తెలిపారు. ఒక్కరోజైనా జగన్ మోహన్ రెడ్డి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారా అని ప్రశ్నించారు. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు కూడా వెళ్లిన దాఖలాలు లేవని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టులు చేపట్లేదని తెలిపారు. పంట బీమా కోసం కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం ప్రీమియం డబ్బు చెల్లిస్తుంటే ,ఆ డబ్బు ప్రీమియం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కట్టకుండా రైతులను మోసం చేస్తున్నాడని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియం సొమ్మునే జగన్ బీమా సొమ్ము కింద పంపకాలు చేస్తున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కి 13 లక్షలు బీమా పేరుతో డబ్బులు అకౌంట్ లో పడ్డాయని తెలిపారు. వైసిపి ప్రభుత్వం బీమా పేరుతో బతుకుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 90 శాతం తో డ్రిప్పులు ఇచ్చే వారిని అయితే ప్రస్తుత ప్రభుత్వం జగన్ డ్రిప్పులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారని విమర్శించారు.ఇది రైతు ప్రభుత్వం కాదు రైతు దగా ప్రభుత్వమని విమర్శించారు. రైతులను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టుతున్నాడని తెలియజేశారు.ఈ సమావేశంలో రైతులు ఈశ్వరయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి కుల్లాయప్ప, రైతు సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజు, రైతు సంఘం నియోజకవర్గ సహాయ కార్యదర్శి జిలకర భాస్కర్ ,జనసేన రాష్ట్ర ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ,సిపిఐ ఎక్స్ కౌన్సిలర్ మాధవ ప్రకాష్,ప్రజానాట్యమండలి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాదు పుల్లయ్య, జి.కొట్టాల గ్రామ రైతులు సూరి బాబు ,సీనా, నాగరాజు, రాముడు, చైతన్య, శీన, దోనుముక్కల రైతులు గురు స్వామి, ములకలపెంట రైతులు భాస్కర్, జయరాముడు, ఎన్కోటాల రైతు సయ్యద్ బాషా ,నక్కన్ దొడ్డి గ్రామ రైతు రమేషు, సోమన్న ,నల్లగొండ రైతు రామాంజనేయులు, వేములపాడు గ్రామ రైతు మాబు, చితాంబరం, సిపిఐ నాయకులు లింగమూర్తి, మల్లయ్య, నాగేంద్ర ,నూర్ భాషా, సత్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img