Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

తేలని దిల్లీ పంచాయితీ

దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పొడే గిట్టని కేంద్ర ప్రభుత్వం మంకుతనాన్ని మాన్పించే తాహతును వినియోగించుకునేందుకు సుప్రీంకోర్టు కూడా సిద్ధంగా ఉన్నట్టు లేదు. దిల్లీ ప్రభుత్వ నిర్వహణ బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన వెంటనే మోదీ ప్రభుత్వం…ఆ తీర్పును వమ్ము చేయడానికి సర్వాధికారాలు ముఖ్యమంత్రి నుంచి లాగేసి లెఫ్టినెంట్‌ గవర్నరుకు కట్టబెడ్తూ ఆర్డినెన్సు జారీచేసింది. ఈ ఆర్డినెన్సును కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. నిజానికి ఈ విషయంలో తన తీర్పును పక్కన పెట్టి…కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలను లాగేసిన నేపథ్యంలో తీర్పు చెప్పడం కూడా కష్టమైన పనే. అందుకే పంచాయితీ పెద్దల తీర్పు పద్ధతిలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా చర్చించుకుని పరిష్కరించడం మంచిదని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. దిల్లీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (డి.ఇ.ఆర్‌.సి.) అధిపతిని నియమించే అధికారం ప్రభుత్వానిదా, లెఫ్టినెంట్‌ గవర్నర్‌దా అన్న వివాదం ఏర్పడినప్పుడు గీత గీసినట్టు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిరచడం కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. అందుకే ముఖ్యమంత్రి కేజ్రివాల్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించవలసి వచ్చింది. తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. అసలు గవర్నర్‌తో రాజకీయ విభేదాలు లేదా గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయ విభేదాలు తలెత్తడమే విచిత్రం. అయితే 2015లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు నిరంతరం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యవహారసరళి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం అంటే అది వ్యక్తిగత వైఖరివల్ల తలెత్తిన సమస్య అయి ఉండొచ్చు. కానీ ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా ఉన్న వారందరి ప్రవర్తనా కయ్యానికి కాలుదువ్వే రీతిలోనే ఉంది. ఇది వారి వ్యక్తిగత వ్యవహార సరళి వల్ల ఉత్పన్నమైన సమస్య కాదు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే లెఫ్టినెంట్‌ గవర్నర్లు పెడసరంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల గవర్నర్లు ఏదో ఒక రూపంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతూనే ఉన్నప్పటికీ దిల్లీ పరిస్థితి మరీ విపరీతంగా ఉంది. దిల్లీలో తమకు అధికారం దక్కకపోవడాన్ని బీజేపీ భరించలేకపోతోంది. బీజేపీకి తిరుగులేని నాయకుడైన మోదీ ఉండగా దేశ రాజధాని నగరంలో తమకు అధికారం లేకపోవడం ఆ పార్టీకి నామోషీగా ఉన్నట్టుంది. కానీ అహంకార ధోరణితో ప్రజా తీర్పును తిరగతోడడం సాధ్యం కాదుగా!
సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వానికి పాలనాధికారాలు ఉన్నాయి అని తీర్పు చెప్పిన తరవాత కేంద్ర ప్రభుత్వం 239ఈ అధికరణంలోని ఏడవ క్లాజును వినియోగించుకుని ఆర్డినెన్సు జారీ చేసింది. అంటే రాజ్యాంగాన్ని సవరించినట్టేనని ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచి అభిప్రాయపడిరది. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం కనక ఈ వివాదాన్ని రాజ్యాంగ బెంచికి అప్పగించవలసి ఉంటుందా అన్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. రాజ్యాంగ సవరణను పార్లమెంటు దృష్టికి తీసుకురాకుండా దొడ్డి దారిన రాజ్యాంగాన్ని సవరించినంత పని చేయడం కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనం. అందుకే దిల్లీ ప్రభుత్వ పాలనాధికారాలను లాగేస్తూ జారీచేసిన ఆర్డినెన్సు రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు పరిశీలించవలసి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయడం వల్ల ప్రభుత్వ ఉన్నతాధికారులను నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పడిరది. ఉన్నతాధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు ఆ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించవలసిన అవసరం ఏమిటి అని అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇటీవలే దిల్లీలో భారీ వర్షాలు కురిసినప్పుడు తలెత్తింది. బాధితులను ఆదుకోవడానికి తక్షణ సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచిస్తే ఆయన పట్టించుకో లేదు. అంటే ఇలాంటి వైఖరి అనుసరించి పరిపాలనకు ఆటంకం కలిగిస్తే కేంద్ర ప్రభుత్వ పంతం నెగ్గితే నెగ్గవచ్చు. కానీ పరిపాలన కుంటువడితే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అన్న పట్టింపు కేంద్ర ప్రభుత్వానికి లేనేలేదు. పాలనాధికారాలు దిల్లీ ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు మేలో తీర్పు చెప్పిన వారం రోజులకే దాన్ని వమ్ము చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేసింది. ఈ ఆర్డినెన్సును పార్లమెంటు సమావేశంలో బిల్లురూపంలో ప్రవేశపెట్టి ఉభయ సభల్లో ఆమోదిస్తే చట్టం అవుతుంది. బీజేపీకి ఉన్న మెజారిటీ వల్ల అదేమంత కష్టమైన పని కాదు. కేంద్రం ఆర్డినెన్సు జారీ చేయడం వల్ల దిల్లీ ప్రభుత్వంలో పని చేయవలసిన అధికారులను నియమించే అధికారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. నియామకం ఒకరిది, పని చేయించుకోవలసింది మరొకరు అయినప్పుడు, ఈ రెండు వ్యవస్థల మధ్య సామరస్యం లేదు అని గ్రహించినప్పుడు ఆ అధికారులు ఎలా వ్యవహరిస్తారో ఊహించవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి దిల్లీ ప్రభుత్వానికి మధ్య వైషమ్యాల వల్ల విద్యుత్‌ వ్యవస్థకు అధిపతే లేని పరిస్థితి ఏర్పడిరది. సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు ఘర్షణ వాతావరణం మరింత పెరుగుతుంది. ఈ ఆర్డినెన్సు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని దిల్లీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ఆర్డినెన్సు అమలు కాకుండా స్టే విధించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం కోరుతోంది. దిల్లీ రాష్ట్రం కాని రాష్ట్రం. దిల్లీ జాతీయ రాజధాని ప్రదేశం అని వ్యవహరిస్తారు. కొంతకాలం దిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది. ఆ తరవాత రాష్ట్ర ప్రతిపత్తి దక్కింది. కానీ కొన్ని పరిమితులున్నాయి కనక సంపూర్ణమైన రాష్ట్ర ప్రతిపత్తి లేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వం ఆడిరది ఆటగా సాగుతోంది. దిల్లీకి ఉన్న ఈ విశిష్టతను కేంద్రం దుర్వినియోగం చేయడం ఘోరమైన పరిస్థితి. ఇలాంటి స్థితిలో ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూర్చుని చర్చించుకుని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించు కోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచన ఏ మేరకు ఫలిస్తుందో చెప్పలేం. ఈ వివాదంలో చట్టపరమైన అంశాలు, అధికార పరిధులకు సంబంధించిన విషయాలకన్నా కేంద్ర ప్రభుత్వ అహంకార పూరిత ఆధిపత్య ధోరణి ప్రమాదం కావడమే అసలు సమస్య. ఈ వైఖరి దేశ రాజధాని పాలనను ఇబ్బందుల్లో పడవేస్తుంది. దేశ రాజధానిలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఏ పక్షానికీ గౌరవప్రదం కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img