Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మణిపూర్‌పై పెదవి విప్పిన మోదీ

ప్రజాస్వామ్యం భారత్‌ నరనరాల్లో జీర్ణించుకు పోయింది అని దండోరావేస్తూ నాలుగు దేశాలలో పర్యటించడానికి ప్రధానమంత్రికి తీరిక దొరికింది. కానీ అగ్ని గుండంలా మారిన మణిపూర్‌ గురించి పెదవివిప్పడానికి మోదీకి 78రోజులు పట్టింది. అదీ యథాలాపంగా పార్లమెంటు సరసన విలేకరులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు మోదీ మణిపూర్‌ ప్రస్తావన తెచ్చారు. ఆ విషయంలో విపులమైన సమాచారం ఇవ్వలేదు. మణిపూర్‌ ప్రజలకు భరోసా కల్పించే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మణిపూర్‌ వ్యవహారాన్ని ప్రధాన మంత్రి మోదీ ప్రస్తావించడం యథాలాపంగానే జరిగింది కనక అక్కడ కొనసాగుతున్న విచ్చలవిడి హింసాకాండ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శాంతియుతంగా మెలగాలని కనీసం మణిపూర్‌ ప్రజలకు విజ్ఞప్తి అయినా చేయలేదు. మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభమైన మే మూడవ తేదీ మర్నాడు ఇద్దరు మహిళలను నగ్నంగా పరేడ్‌ చేయించి అత్యాచారం చేశారన్న సమాచారం బుధవారం అందింది. దానికి సంబంధించిన వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరవాతే మోదీ ఇది భయంకరమైన సంఘటన అన్నారు. దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మెజారిటీ వర్గమైన మెయితీలను కూడా గిరిజనులుగా పరిగణించాలని కోరడంతో అగ్గి అంటుకుంది. ఈ వాదనకు బీజేపీ అండ ఉంది. మణిపూర్‌ లో గిరిజనులైన కుకీల మీద దాడులు జరుగుతున్నా మోదీ కానీ, బీజేపీకానీ నోరు విప్పలేదు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటే మెరుగైన పరిస్థితి ఉంటుందన్న బీజేపీ నిరంతర ప్రచారంలోని డొల్లతనం మణిపూర్‌లో బాహాటంగా రుజువైంది. దీని గురించి మోదీ ప్రస్తావించనే లేదు. మణిపూర్‌ హింసాకాండ శూన్యంలో జరుగుతోందని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. ఉదాహరణ ప్రాయంగా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. షరా మామూలుగా గుర్తు తెలియని వారిపై ఎఫ్‌.ఐ.ఆర్‌.లు నమోదు అవుతూనే ఉన్నాయి. మణిపూర్‌లో మహిళలమీద అత్యాచారాన్ని ఖండిరచిన మోదీ తన కుట్రపూరిత రాజకీయ వైఖరిని మాత్రం వదలలేదు. మణిపూర్‌ సంఘటన తనను విచలితుణ్ని చేసింది అని చెప్తూనే మన తల్లులను, చెల్లెళ్లను కాపాడుకోవలసిన అవసరం ఉందంటూనే కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ ప్రస్తావన అవసరం లేకుండానే తీసుకొచ్చారు. మహిళల మీద అత్యాచారాలు జరిగిన బీజేపీ పాలితరాష్ట్రాల ప్రస్తావన ఆయన పొరపాటున కూడా తీసుకు రాలేదు. ఆ సంఘటనలన్నింటినీ చాకచక్యంగా చాప కిందికి తోసేశారు. కథువా అత్యాచార సంఘటన, బిల్కిస్‌ బానోపై మూకుమ్మడి అత్యాచారం సంఘటనలు మోదీకి పొరపాటున కూడా గుర్తుకు రాలేదు. మణిపూర్‌ పరిస్థితిపై ప్రధానమంత్రి మౌనం పాటిస్తున్నందుకు అనేక విమర్శలు ఎదురైనాయి. మణిపూర్‌ సమస్యను పరిష్కరించడం మీకు చేతకాకపోతే మేమే సమస్యను తీసుకుని పరిష్కారం చేస్తామని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.ఇప్పటికైనా మోదీ కదులుతారేమో చూడాలి. మణిపూర్‌ పరిస్థితిపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. మొదట ప్రధానమంత్రి మణిపూర్‌ పరిస్థితిపై ప్రకటన చేస్తే ఆ తరవాత చర్చించవచ్చునని ప్రతిపక్షాలు అంటున్నాయి.
మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అల్లర్లను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. హింసాకాండ మొదలైనప్పుడు బీరేన్‌ సింగ్‌ చేసిన ప్రకటనల్ల్లో జాతుల గొడవ లేనే లేదు అన్నారు. ఈ అల్లర్లకు ‘‘తీవ్రవాదులు’’, ‘‘చొరబాటుదార్లు’’ కారణం అని చెప్పారు. తనను విమర్శిస్తున్న వారిని మైన్మార్‌ నుంచి వచ్చిన కుకీలు అన్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని బీజేపీ మిత్రపక్షాలు కూడా కోరినా పరిస్థితిలో మార్పులేదు. బీజేపీ వారి గురించి మోదీ ప్రస్తావించనే లేదు. అల్లర్లు ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండాచేసింది. ఇలా చేయడం బీజేపీ ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. సామాజిక మాధ్యమాలు విచ్ఛిన్నకరమైన పాత్ర పోషించకుండా చేయడానికి ఇంటర్నెట్‌ లేకుండా చేస్తున్నా దానివల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుతోంది. హింసాకాండను అదుపు చేయలేని ప్రతి సందర్భంలోనూ ఇంటర్నెట్‌ను అదుపు చేస్తున్నారు. ఇంటర్నెట్‌ సదుపాయం ఉండి ఉంటే ఇద్దరు మహిళల మీద అత్యాచార సమాచారం వెంటనే అందేదేమో. పైగా ఈ అత్యాచారానికి సంబంధించిన వీడియోలను ప్రసారంచేసినందుకు ట్విట్టర్‌మీద చర్య తీసుకోవాలనుకోవడం ఆడలేక మద్దెలఓడు అన్నట్టే ఉంది. ఇంటర్నెట్‌ సదుపాయం లేనందు వల్ల వాస్తవ సమాచారం కూడా బయటకు రావడం లేదు. సరైన సమాచారం అందనప్పుడు వదంతులు రాజ్యమేలుతాయి. వాస్తవం చెప్పడానికి ప్రయత్నించిన వారిమీద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల మణిపూర్‌లో పర్యటించి వచ్చిన నిజనిర్ధారణకమిటీ ‘‘ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుతున్న హింసాకాండ’’ అన్నందుకు వారి మీద పోలీసులు చర్య తీసుకుంటున్నారు. తరచుగా ఇంటర్నెట్‌ సదుపాయం తొలగించడంలో భారత్‌ అగ్రస్థానంలో ఉందని ఇటీవలే జి20 సమావేశాల్లో కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. వాస్తవాలు రాసే పత్రికా రచయితలను జైళ్లలో పెట్టడం ఈ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. కశ్మీర్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. మణిపూర్‌లో మహిళలమీద అత్యాచార వీడియో బయటకు రాకుండా ఉంటే ప్రధానమంత్రి ప్రస్తావించే వారా? అసలు ఈ కేసులో చర్య తీసుకోవడం సాధ్యమయ్యేదా? మణిపూర్‌ లో లైంగిక అత్యాచారం గురించి తప్ప మరే అంశాన్నీ మోదీ ప్రస్తావించలేదు. అత్యాచారాలు జరగడం ఇది మొదటిసారికాదు. ఇలాంటి సంఘటనలు కనీసం ఆరు జరిగాయి. మణిపూర్‌లో హింసాకాండను అదుపు చేయడానికి ప్రయత్నించడం మానేసి సమాచారప్రసారాన్ని అదుపుచేయాలనుకోవడం పిచ్చిపని. సమా చారాన్ని అడ్డుకోవడంవల్ల ఒక్క సమస్యా అయినా పరిష్కారం అయిన దాఖలా లేదు. దీనివల్ల జరిగేదల్లా పాలనావిభాగం అతిగా ప్రవర్తించడానికి మాత్రం అవకాశంకలుగుతుంది. ఇంటర్నెట్‌ లేకుండా చేయడంవల్ల తప్పుడు సమాచారం వ్యాపించ కుండా ఒకటి రెండురోజులు అదుపు చేయవచ్చునేమో. కానీ అసలైన సమాచారం అందకుండా పోతుంది. మణిపూర్‌ ప్రభుత్వం ప్రజా స్వామ్య పద్ధతులను అనుసరించడమే లేదు. ప్రజల మీద యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. ప్రస్తుత సమస్యను పరిష్కరించే ఉద్దేశం మణిపూర్‌ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. అంటే మోదీ, అమిత్‌ షా ద్వయానికీ లేనట్టే.
సమాచారాన్ని అడ్డుకోవడం హింసాకాండను అణచడానికి ఉపకరించదు కానీ ప్రభుత్వ యంత్రాంగం తమ అకృత్యాలను కప్పి పుచ్చడానికి కచ్చితంగా తోడ్పడుతుంది. మణిపూర్‌ లో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలిస్తేనే రాజకీయ పరిష్కారం కుదరడం వీలవుతుంది. కానీ బీజేపీ ఈ పరిస్థితి ఆసరగా కుటిల రాజకీయాలు చేస్తోంది. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణ దండన విధించే ఆలోచన చేస్తున్నామని అక్కడి ప్రభుత్వం అంటోంది. కానీ కఠినశిక్షలు నేరాలని, ఘోరాలను తగ్గించిన ఆనవాళ్లు ఎక్కడాలేవు. మణిపూర్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలం అయితే కేంద్ర ప్రభుత్వం రాజకీయ పరిష్కారం కనుగొనడంపై దృష్టే పెట్టడం లేదు. ఈ రెండు వైఫల్యాలలోనూ బీజేపీకి స్వార్థ ప్రయోజనాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img