Free Porn
xbporn
https://www.bangspankxxx.com
గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే హబ్ లక్ష్యం : ఎమ్మెల్సీ కవిత
- గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంతో ఈ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరైంది. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీ గణేశ్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్ ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు. ఐటీ హబ్ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్‌లో సాఫ్ట్వేర్ అభివృద్ధికి ఐటీ హబ్ కేంద్ర బిందువు అవుతుందని తెలిపారు. ఇది మొదటి దశ మాత్రమే అని, త్వరలో రెండో దశగా ఐటీ హబ్ కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్క్, ఆటో పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.