Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కంటి చూపు పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలి

శ్రీ సత్య సాయి జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిని డాక్టర్ సి. అనురాధ

విశాలాంధ్ర – ధర్మవరం : కంటి చూపు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలను పాటించాలని శ్రీ సత్య సాయి జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారిని డాక్టర్ సి. అనురాధ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శనివారం పట్టణంలోని అక్షయ మానస, అక్బర్, జ్యోతి, నేత్రాలయ, ఖలీల్ తదితర కంటి పరీక్షా కేంద్రాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వీటిలో ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కంటి పరీక్ష కేంద్రాలులో కంటి పరీక్ష నిర్వహించకుండా, ఆపరేషన్లు,మందులు పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రభుత్వం తెలిపిన నామ్స్ ప్రకారమే ఈ కంటి పరీక్ష కేంద్రాలు నిర్వహించాలని, అట్లు కాకుండా ఇష్టం వచ్చినట్లు నడిపితే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పట్టణంలో ఐ కేర్ అని, క్లినిక్ అని, ఆప్టికల్స్ అని పేర్లతో కంటి పరీక్షలు చేయడంతో పాటు కంటి ఆపరేషన్లను కూడా నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. తప్పనిసరిగా ఇటువంటి పేర్లు కాకుండా కేవలం “కంటి పరీక్ష కేంద్రం” అన్న బోర్డు మాత్రమే పెట్టాలని సూచించారు. కంటి పరీక్ష కేంద్రాలలో ఆప్తాలిక్ అసిస్టెంట్ గాని ఆప్తో మెట్రీషియన్ మాత్రమే కంటి పరీక్షలు నిర్వహించాలి, ఇతరులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్వహించరాదని గట్టిగా హెచ్చరించడం జరిగిందని తెలిపారు. ఓ రిటైర్డ్ కంటి వైద్యాధికారి ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మరికొన్నిచోట్ల ఫార్మసీ పేరుతో సర్జరీలు కూడా చేయడం మా దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇటువంటివన్నీ కూడా నమోదు చేసుకొని కలెక్టర్కు నివేదిక పంపడం జరుగుతుందని తెలిపారు. కంటి పరీక్ష కేంద్రాలలో కంటి తప్ప వేరే ఇతర వైద్య చికిత్సలు చేయడం గాని, రెఫర్లు చేయడం గాని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయరాదని హెచ్చరించడం జరిగిందన్నారు. ఆకస్మిక తనిఖీలు కొన్ని ఐ సెంటర్లో పొంతన లేని సమాధానాలు చెప్పడం జరిగిందని, అటువంటి వారికి అవగాహన కల్పించి ప్రజల కళ్ళను కాపాడే బాధ్యతను తాము తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కంటి ఆపరేషన్లు చేయించిన తర్వాత రోగులపైన ఫాలోఅప్ కూడా లేదని, తప్పనిసరిగా ఫాలోఅప్ ఉండాలని వారు సూచించారు. స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా సరే కంటి ఆపరేషన్లు చేయాలి అంటే తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ వారి యొక్క రాతపూర్వకమైన అనుమతి తప్పనిసరి ఉండాలని తెలిపారు. అర్హత లేని వారితో పట్టణములో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారనేది మా పరిశీలనలో తేలిందని తెలిపారు. ప్రజలందరూ కూడా కేవలం కంటి అద్దాల కొరకు మాత్రమే కంటి పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయస్సార్ కంటి వెలుగు, అవ్వ తాత కార్యక్రమాలలో అన్ని వయసుల వారికి కంటి పొర వచ్చిన వారికి, కంటి లోపం ఉన్నవారికి అనుభవజ్ఞులైన అర్హత కలిగిన కంటి డాక్టర్లచే వైద్య చికిత్సలు అందించి ఉచితంగా ఆపరేషన్లు ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఇటువంటి కార్యక్రమాలను ప్రజలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ కంటి వైద్యం చేయించుకుంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు. జిల్లావ్యాప్తంగా కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి కూడా అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రావణి, సిబ్బంది లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్, జాకీర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img