Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మరో అల్పపీడనం

. ఏపీ, తెలంగాణకి భారీ వర్ష సూచన
. వాతావరణశాఖ హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడిరచింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్నాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర మంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అల్పపీడన ప్రభావం కారణంగా ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడిరచారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ముఖ్యంగా మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.
కృష్ణాకు వరద` ప్రకాశం బ్యారేజీ వద్ద 14 గేట్లు ఎత్తివేత
ఏపీతో పాటు తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన ఉన్న మునేరు, కట్టలేరులు, చిన్నవాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. బ్యారేజీ వద్ద 3 టీఎంసీలకు మించి నీటి నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రానికి బ్యారేజీ వద్దకు సుమారు 20వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 14 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img