Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

కలవరం రేపుతోన్న కండ్లకలక కేసులు..

లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
వాతావరణంలో మార్పుల కారణంగా కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నాయి. కండ్లకలతో ఇబ్బందులు పడుతూ పలువురు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 713 మంది విద్యార్థులుండగా.. 260 మంది విద్యార్థులకు ఈ వైరస్ వ్యాపించింది. కుమురంభీం జిల్లా గన్నారంలోని జ్యోతిబా ఫులే గురుకుల బాలికల పాఠశాలలోని 200 మంది విద్యార్థినులకు, కాగజ్‌నగర్‌ పట్టణ కాపువాడలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు కళ్లకలక సోకగా వారిని అధికారులు స్వస్థలాలకు పంపించారు.సాధారణ బ్యాక్టీరియా లేదా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. జలుబు కారకమైన వైరస్‌తో కూడా కండ్లకలక వస్తుందని అంటున్నారు. వర్షాకాలం కావడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకి కలక వస్తోందని, గాలిలో ఎక్కువగా ఉండే తేమ బ్యాక్టీరియాకు కారణమవుతోందని అంటున్నారు.

కండ్లకలక అనేది ఒక వ్యక్తి నుండి మరొకరికి వేగంగా వ్యాపించే వైరస్. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది కంటి నుండి స్రావాల ద్వారా వ్యాపిస్తుంది. టవల్స్, దిండు కవర్లు, మేకప్ వస్తువులు వంటి వ్యక్తిగత వస్తువుల ద్వారా ఇది ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. మన పరిసరాలలో ఎవరికైనా కండ్లకలక ఉంటే వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు తాకడం, వాడడం చేయొద్దు. తప్పని పరిస్థితుల్లో తాకితే.. తరచూ చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక వస్తే తప్పని సరిగా కళ్లద్దాలు ఉపయోగించాలి.

ఇది సాధారణం కంటి ఇన్ఫెక్షన్ అయినప్పటికీ., వెంటనే చికిత్స చేయకపోతే ఇది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఫార్మసీ నుండి యాంటీబయాటిక్స్ ప్రయత్నించిన తర్వాత డాక్టర్ వద్దకు వస్తారని..,కానీ అలా చేయకూడదని అంటున్నారు. కంటి నిపుణుడిచే సూచించబడిన యాంటీబయాటిక్స్, కంటి చుక్కలను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img