Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

టీకా ప్రత్యేక కార్యక్రమం , డీవార్నింగ్ కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరణ

విశాలాంధ్ర,సీతానగరం : మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమంను, డీ వార్నింగ్ కార్యక్రమాలను ప్రజా ప్రతినిదులు విజయవంతం చేయాలని సీతానగరం, పెదంకలం వైద్యులు శిరీష, రాధాకాంత్ లు తెలిపారు.శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బలగ రవనమ్మ, జెడ్పీటీసీ బాబ్జిలతో పాటు మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచుల చేతుల మీదుగా ఆయా కార్యక్రమాలకు సంబందించి పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. మిషన్ ఇంద్ర ధనుష్ ద్వారా పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ళ పిల్లల వరకు షెడ్యూల్ ప్రకారం వ్యాధినిరోధక టీకాలు వేయాలని, ఎవైనా కారణాల వల్ల ఆసమయానికి పిల్లలకు టీకా వేయకపోతే వారిని గుర్తించి, వారికి ఈనెల 7నుండి 12 వరకు వేయడమే లక్ష్యమని వైద్యులు తెలిపారు.
ఈనెల 10న డీ వార్మింగ్ డే కార్యక్రమం ద్వారా నులిపురుగులు నివారణకు మందులు వేయటం జరుగుతుందన్నారు. అందరు దీనిపై దృష్టిపెట్టి సహకారాన్ని అందించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ ప్రసాద్, ఈఓపిఆర్డీ వర్మ మండల అధికారులు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు. అనంతరం రెండో పూట ఎంపిడిఓ కార్యాలయంలో మండలంలోని ఉన్నత, ప్రాదమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని వైద్యులు శిరీష, రాధాకాంత్ లు నిర్వహించి డీ వార్మింగ్ కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. పిల్లలకు నులి పురుగులు మందులు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ ప్రసాద్, ఎంఈ ఓ సూరిదేముడు, వెంకటరమణ, హెచ్ ఎం లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img