Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం పూర్తి చేయాలి

విశాలాంధ్ర, పెద్దకడబూరు : ఆర్డీఎస్ కుడి కాలువ పనులు పూర్తి చేయాలంటూ శనివారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి ఆంజనేయ మాట్లాడుతూ రాజోలిబండ డైవర్షన్ స్కీం కు కుడి కాలువ నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ లో నీరు లేకపోవడంతో ఇసుకమేటలతో కనిపిస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి ఆర్డీఎస్ నిండుకుండలా కళకళలాడేదన్నారు. వర్షాలు లేకపోవడంతో వెలవెలబోతుందన్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులను, ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలన్నారు. అలాగే మంత్రాలయం నుంచి కర్నూలుకు రైల్వేలైను ఏర్పాటు చేయాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు జాఫర్ పటేల్, నాయకులు తిక్కన్న, డోలు హనుమంతు, గోపాల్, రామాంజనేయులు, నర్సింహులు, నాగేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img