Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

దేశంలో కొవిడ్ కల్లోలం.. 63 జేఎన్ 1 వేరియంట్ కేసులు.. 4 వేలు దాటిన యాక్టివ్ కేసులు

మరోసారి కరోనా మహమ్మారి దేశాన్ని తీవ్ర కలవర పాటుకు గురి చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకువస్తుండటంతో కొవిడ్ భయాలు ఇంకా వీడటం లేదు. గత కొన్ని నెలలుగా దాదాపుగా తగ్గిపోయిన రోజు వారీ కేసులు.. ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతుండటంతో మరోసారి కొవిడ్ ముప్పు ముంచుకొస్తుదేమోనని తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త వేరియంట్ జేఎన్ 1 కారణంగానే దేశంలో ఈ కేసుల పెరుగుదలకు కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కొత్తగా గత 24 గంటల్లో 628 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. కొవిడ్ ధాటికి మరొకరు బలి అయ్యారు. మరోవైపు.. కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 రోజు రోజుకూ విస్తరిస్తోంది. డిసెంబర్ 24 వ తేదీ వరకు దేశంలో మొత్తం 63 జేఎన్ 1 కొవిడ్ వేరియంట్ కేసులు కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఒక్క గోవా నుంచే 34 కేసులు నమోదైనట్లు తెలిపాయి. మహారాష్ట్ర 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణ నుంచి 2 జేఎన్ 1 కేసులు నమోదైనట్లు చెప్పాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4054 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం నాటికి 3742 గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 4 వేలు దాటింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు.

ఇక ఈ 628 కొత్త కేసుల్లో జేఎన్ 1 కొత్త వేరియంట్ మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 5,33,334 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలోని థానేలో నవంబర్ 30 వ తేదీ నుంచి పరీక్షించిన 20 నమూనాలలో 5 జేఎన్ 1 కేసులు నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే వారెవరూ ఆస్పత్రుల్లో చేరలేదని పేర్కొన్నారు. ఇక దేశంలో ఆదివారం 656, శనివారం 752 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్రం సూచించింది. కానీ అదే సమయంలో కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img