Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కౌలు కోసం ఆందోళన

. సీపీఐ, రాజధాని అమరావతి రైతుల ధర్నా
. దద్దరిల్లిన సీఆర్డీఏ కార్యాలయం
. అడ్డుకున్న పోలీసులు… నిరసనకు దిగిన అన్నదాతలు
. 15లోగా కౌలు చెల్లించాలి: రామకృష్ణ బ చెల్లించకుంటే నిరవధిక ముట్టడి: ముప్పాళ్ల

విశాలాంధ్ర – విజయవాడ: రాజధాని అమరావతి రైతులు కౌలు కోసం ఆందోళన నిర్వహించారు. దీంతో స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ, రాజధాని అమరావతి రైతుల జేఏసీ అధ్వర్యంలో దాదాపు వంద మంది రాజధాని రైతులు నినాదాలు చేస్తూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు కార్యాలయం గేట్లు మూసేసి అడ్డుకున్నారు. వినతిపత్రం ఇవ్వటానికి వస్తే లోపలికి ఎందుకు రానివ్వటం లేదని రైతులు నిలదీశారు. పెద్ద పెట్టున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మహిళా రైతులు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు తక్షణమే కౌలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఆర్డీఏ కమిషనర్‌కు వినతి పత్రం అందించేందుకు వచ్చిన రైతులను అడ్డుకోవడం అన్యాయమన్నారు. రాజధాని నిర్మాణానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతులు, ఆ భూములపై ఆధారపడిన రైతు కూలీలు నేటికీ కౌలు, పింఛన్లు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. జనవరి 15వ తేదీ సంక్రాంతి పండుగలోగా కౌలు వేసి చిన్న, సన్నకారు రైతులతో పాటు దళిత, బలహీనవర్గాల రైతులందరినీ ఆదుకోవాలని కోరారు. పేద అసైన్డ్‌ రైతులకు మూడు సంవత్సరాలుగా వివిధ కారణాలతో కౌలు నిలిపివేశారని, వారి కుటుంబాలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని తెలిపారు. 2023, మే నెలలో రావలసిన వార్షిక కౌలు 2024 జనవరి నెల వచ్చినా రైతులకు జమ కాలేదన్నారు. భూములు కోల్పోయిన రైతులకు వార్షిక కౌలు మాత్రమే జీవనాధారమని, కౌలు రాక కుటుంబ పోషణకు, పిల్లల చదువులకు వైద్య అవసరాలకు రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అసైన్డ్‌ చట్టాల మార్పులతో సంబంధం లేకుండా తక్షణమే వారికి వార్షిక కౌలు బకాయిలతో సహా చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ భూ సమీకరణ ఒప్పందం జరిగిన మూడు సంవత్సరాలలో రైతులకు ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించాలని ఆ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొనటం జరిగిందని తెలిపారు. అయితే, ఇప్పటికి ఏడు సంవత్సరాలైనా స్థలాల అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వం మారిన తరువాత రాజధాని నిర్మాణ కార్యకలాపాలు నిలిచి పోవటంతో ఆ ప్రాంతం ముళ్లకంపలు, చెట్లతో నిండిపోయిందన్నారు. వెంటనే ముళ్ల కంపలను తొలగించి, రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యాత్మక ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన కేటాయింపుల గురించి రైతులకు వివరించి వారి అనుమతితో మాత్రమే వారి వారి గ్రామాల పరిధిలో సరైన కొలతలతో, రహదారులతో, వీధిపోట్లు లేకుండా ప్లాట్లను అందించాలని కోరారు. సంక్రాంతిలోపు రైతులకు కౌలు చెల్లించకుంటే అన్ని రాజకీయ పార్టీల జేఏసీ అధ్వర్యంలో సీఆర్‌డీఏ కార్యాలయాన్ని నిరవధికంగా ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో భూమిలేని పేదలకు నెలవారీ ఇస్తున్న పెన్షన్‌ రూ.2,500ను రూ.5 వేలకు పెంచి అందిస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేకసార్లు బహిరంగంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని పేదల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచి, బకాయిలతో సహా అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీసు అధికారుల సూచన మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ క్యార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌, రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులు ధనేకుల రామారావు, గౌర్నేని స్వరాజ్యరావు, బెల్లంకొండ నరసింహారావు, పువ్వాడ సుధాకర్‌, కల్లం రాజశేఖర్‌రెడ్డి, గుజ్జర్లపూడి అనిత, బెజవాడ రమేష్‌బాబు, గుర్రం జయకృష్ణ, కొండెపాటి సతీష్‌, శాంత, కంభంపాటి శిరీష తదితరులు సీఆర్‌డీఏ కార్యాలయంలోకి వెళ్లి డిప్యూటీ కమిషనర్‌ సలీమ్‌ బాషాను కలిసి రైతుల సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన ఆయన కార్యాలయం బయటకు వచ్చి రైతులతో మాట్లాడారు. తాము కౌలు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని, సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేశామన్నారు. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్సు రావాల్సి ఉందని తెలిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరోసారి ప్రభుత్వానికి లేఖ రాస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img