Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

దేశమంతా అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు..

దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోంది. రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్‌ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్‌. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ముఖ్యఅతిథిగా హాజరవ్వగా కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ముర్ము, మాక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కర్తవ్యపథ్‌లో భారతీయ కళాబృందాలు పరేడ్‌ను ప్రారంభించగా.. 25 శకటాల ప్రదర్శన నిర్వహించాయి. అత్యాధునిక మిలటరీ టెక్నాలజీని ప్రదర్శించింది భారత్‌. పరేడ్‌లో ఫ్రాన్స్‌ సైనిక బలగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 20 భీష్మ యుద్ధట్యాంకులు, అధునాతన నాగ్‌ మిసైల్‌ సిస్టమ్‌, పినాక మల్టీ బ్యారెల్‌ సిస్టమ్‌ కలర్‌ఫుల్‌గా నిలిచింది. అడ్వాన్స్‌డ్‌ రేడియో ఫ్రీన్వెన్సీ సిస్టమ్‌ ప్రదర్శించగా.. భారత సైనిక శక్తిని మాక్రాన్‌కు వివరించారు ప్రధాని మోదీ.

లోక్ సభలో గణతంత్ర వేడుకలు
భారత పార్లమెంట్‌ ఆవరణలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయ్‌. స్పీకర్‌ ఓం బిర్లా… జాతీయ జెండాను ఆవిష్కరించి… పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందించారు.

ఘనంగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి..అసెంబ్లీ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్ తమ్మినేని సీతారాం..ఆపై గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు..అటు శాసనమండలి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మండలి చైర్మన్ మోషేన్ రాజు..గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.. అటు ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎస్ జవహర్‌రెడ్డి..

చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సినీనటుడు చిరంజీవి జాతీయజెండాను ఎగురవేశారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు తనకు ఎంతో ప్రత్యేకమైనవన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. 40 ఏళ్ల చరిత్రలో కళామతల్లికి చేసిన సేవను గుర్తించిన కేంద్రం పద్మవిభూషణ్‌ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

జనసేన కార్యాలయంలో రిపబ్లిక్‌ డే వేడుకలు..
విజయవాడలోని జనసేన కార్యాలయంలో రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు పవన్‌కల్యాణ్‌.

హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన తమిళిసై..
గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారింది, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రజల స్వేచ్ఛకు, హక్కులకు మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు ధైర్యం, వివేకం, ఉత్సాహం అంటూ కామెంట్ చేశారు తమిళిసై. గణతంత్ర వేడుకల్లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన తమిళిసై.. ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img