Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సేవామూర్తులు వాలంటీర్లు వాలంటీర్లు మరింత బాగా పనిచేయాలి

జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుంచి గురువారం వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కింద ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన వాలంటీర్లకు అభినందన జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్ పర్సన్ నదీమ్ అహ్మద్, ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ మంజుల, ఎడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ టి.లక్ష్మి, డీఎల్డిఓలు ఓబులమ్మ, శంకర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఆలమూరు సుబ్బారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వాలంటీర్లు సేవామూర్తులు అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైనికులుగా పురస్కారాలు అందుకుంటున్న వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న సాధించారన్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాలైన అమ్మ ఒడి, జగనన్న తోడు, చేయూత, తదితర పథకాలను పేద, మధ్య తరగతి ప్రజల వద్దకు వాలంటీర్లు తీసుకెళ్తున్నారన్నారు. వాలంటీర్లు చేస్తున్న సేవ ఎంతో గొప్పదన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో సేవ చేశారన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పక్క రాష్ట్రాలు సైతం మన రాష్ట్రం వైపు చూసేలా జగనన్న పరిపాలన సాగిస్తున్నారన్నారు. వాలంటీర్లు చేస్తున్న సేవకు గుర్తింపుగా సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను ప్రధానం చేయడం జరుగుతోందన్నారు. సేవా వజ్ర పురస్కారాలకు 30,000 నుంచి 45 వేల రూపాయలకు పెంచి అందిస్తున్నారని, సేవా రత్న పురస్కారాలకు 20,000 రూపాయల నుంచి 30 వేల రూపాయలకు పెంచి అందిస్తున్నారని, సేవా మిత్రా పురస్కారాలకు 10 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలకు పెంచి అందించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు వజ్రాలలాంటి వాలంటీర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న తయారు చేశారన్నారు. వాలంటీర్లు వారికి కేటాయించిన 50 ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ వాలంటీర్లు మరింత బాగా పనిచేయాలన్నారు. వాలంటీర్లు చేసిన పని ఎవరు చేయలేరని, కరోనా లాంటి సమయంలో ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. వాలంటీర్లు సామాజిక నాయకులని, మరింత బాగా పని చేయాలని సూచించారు. సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను అందుకుంటున్న వారికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సేవా మిత్రా, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను జడ్పీ చైర్ పర్సన్, జాయింట్ కలెక్టర్, తదితరులు ప్రధానం చేశారు. జిల్లాలో మొత్తం 17 కోట్ల 25 లక్షల 80 వేల రూపాయలను అవార్డుల కింద వాలంటీర్లకు అందజేశారు. అందులో జిల్లాలో 39 మంది సేవా వజ్ర అవార్డు అందుకున్న వాలంటీర్లకు ఒక్కొక్కరికి 45 వేల రూపాయల చొప్పున రూ.17.55 లక్షలు, సేవారత్న అవార్డు అందుకున్న 198 మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి 30 వేల రూపాయల చొప్పున రూ.59.40 లక్షలు, సేవా మిత్రా అవార్డు అందుకున్న 10,943 మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున 16 కోట్ల 41 లక్షల 45 వేల రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే టెస్టిమోనియల్స్ కింద వైఎస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల కింద లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించిన 46 వాలంటీర్లకు వేరువేరుగా నగదు బహుమతులను అందజేశారు. ఇందులో జిల్లా స్థాయిలో ఎంపికైన ఒకరికి 25 వేల రూపాయలు, నియోజకవర్గస్థాయిలో ఎంపికైన 8 మందికి 20 వేల రూపాయల చొప్పున 1,60,000 రూపాయలు, మండలం / మున్సిపాలిటీ స్థాయిలో ఎంపికైన 37 మంది వాలంటీర్లకు 15,000 చొప్పున రూ.5.55 లక్షలను అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img