Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

2 ఎకరాల 50 సెంట్ల మునిసిపల్ స్థలం అన్యాక్రాంతంపై రగడ

  • ప్రతిపక్ష లీడర్ మాబు వలి ఆధారాలతో సహా కౌన్సిల్ లో నిలదీత
  • మున్సిపల్ స్థలాలను కాపాడుకుంటాం
  • తాను మున్సిపాలిటీ నుండి ఒక్క రూపాయి లంచం తిన్నట్లు నిరూపిస్తే దేనికయినా సిద్ధం
  • చైర్మన్ మాబున్నిసా

విశాలాంధ్ర – నంద్యాల : నంద్యాల పట్టణంలో సర్వే నెం 2313/1 లో విస్తీర్ణం 14.42 సెంట్లు మునిసిపాలిటీ కలిగి ఉంది. నంద్యాల మున్సిపల్ భూమి దాదాపుగా 50 కోట్లు విలువగల భూమి. దానిలో 2.40 సెంట్ల స్థలాన్ని 43 ప్లాట్లుగా విభజించి ప్రభుత్వ భూమిని బినామిలతో 8 మందికి రిజిస్టర్ చేసినారని దీని వెనక మున్సిపల్ అధికారులు, సబ్ రీజిస్టార్ల పాత్ర ఉందని మున్సిపల్ కౌన్సిల్లో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు అధికారులపై ధ్వజమెత్తారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్ పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన గురువారం జరిగింది. అజెండా చదివిన వెంటనే దానికి ఆమోదం తెలిపిన తర్వాత మున్సిపల్ చైర్మన్ మాబునిసా మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలకు ఆమె వివరణ ఇచ్చారు. తాను మునిసిపల్ నిధులలో ఎటువంటి గోల్మాల్ చేయలేదని, తన నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదని, తాను అవినీతికి పాల్పడి ఉంటే ఎంతదాకా అయినా సిద్ధంగా ఉన్నానని కౌన్సిల్ సాక్షిగా తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి ఫ్లోర్ లీడర్ మాబువలి మాట్లాడుతూ తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, 2022వ సంవత్సరంలో ఒక వ్యక్తి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకొని,
జిపి చేసుకుంటుంటే మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కోర్టుకు ఎందుకు నివేదించి అక్రమ రిజిస్టర్ లను ఆపలేకపోయారని ప్రశ్నించారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్యాంసుందర్లాల్ మాట్లాడుతూ అసలు హైకోర్టు ఆర్డర్ ఏముంది ? మున్సిపల్ అధికారులు హైకోర్టుకు ఎటువంటి నివేదికలు సమర్పించారో బహిర్గతం చేయాలని ప్రశ్నించారు. 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యాం సుందర్ లాల్,వైస్ చైర్మన్ పాంషావలి, టిడిపి ఫ్లోర్ లీడర్ మహబూబ్ వలి అధికారులను నిలదీస్తు ఛైర్ పర్సన్ మాబున్నిసాకు వివరించారు. దీనిపై ఛైర్ పర్సన్ మాబున్నిసా మాట్లాడుతూ మామీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, నేను ఎలాంటి అవినీతి చేయలేదన్నారు. ఎవరైన చేసీ ఉంటే వారీపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమృత్ పథకం ద్వారా నంద్యాల పట్టణంలో నీటి సమస్య రాకుండా నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్లు, కొ ఆప్షన్ సభ్యులు, అధికారులు ఎంఈఈ రమణమూర్తి, డీఈలు జయ భారత్ రెడ్డి, మదుకుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఓ వెంకట కృష్ణ, టౌన్ ప్లానింగ్ అధికారి నరసింహ మూర్తి. రెజ్వాన, శానిటేషన్ సూపరైజర్ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img