Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

విద్యార్థులు ఆర్థిక స్థితిగతుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ రెడ్డి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించినటువంటి ఆర్థిక అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక పదవినోదం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్ లో జరిగే అన్ని పోటీల్లో ముందుండి పాల్గొనాలని ఎల్డీఎం సత్యరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రభుత్వ కళాశాల స్వయం ప్రతిపత్తి, వాణిజ్యం మరియు నిర్వహణ శాస్త్ర విభాగం మరియు కెనరా బ్యాంక్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించినటువంటి ఆర్థిక అవగాహన వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆర్థిక పదవినోదం పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు శుక్రవారం బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేసీఆర్ దివాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ … కళాశాలలో విద్యతో పాటుగా వివిధ రకాల పోటీలలో పాల్గొని రాజకీయ మరియు ఆర్థిక స్థితిగతుల పట్ల అవగాహన పెంపొందించుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యరాజ్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించినటువంటి ఆర్థిక అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక పదజాలం పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులందరినీ అభినందించారు. భవిష్యత్తులో ఏర్పాటు చేసుకొనే వివిధ రకాలైనటువంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. తదనంతరం బహుమతులు ప్రధానం చేశారు. మొదటి, ద్వితీయ మరియు తృతీయ బహుమతులుగా నాలుగు వేలు, మూడు వేలు, రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటికి తోడుగా రెండు కన్సోలేషన్ బహుమతులను కూడా ప్రిన్సిపాల్, ఎల్డిఎం, తదితరులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య మరియు నిర్వహణ శాస్త్ర విభాగాధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ జి. రంగనాథ్, డా.మల్లికార్జున్ మరియు మురళీ మాధవ్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img