Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ధర్మవరంలో మెడికల్ మాఫియా పై చర్యలు గైకొనాలి..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు.
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం పట్టణంలో కొన్ని హాస్పిటల్ లో మెడికల్ మాఫియాగా తయారవుతున్నాయి అని అటువంటి మెడికల్ మాఫియా పై చర్యలు గైకొనాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిరోజు పట్టణంలోకి 30 వేల నుండి 40 వేల వరకు రోగాల బారిన పడి రోగులు ప్రైవేట్ హాస్పిటల్ కి వస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఓ మెడికల్ మాఫియాగా తయారై, ప్రతి చిన్న జబ్బుకే టెస్టింగ్, స్కానింగ్లు లంటూ రోగుల నుండి వేలాది రూపాయలు దండుకుంటున్నారనీ మండిపడ్డారు. టెస్టింగ్, ల్యాబ్ లకు, స్కానింగ్ సెంటర్ లకు ఎలాంటి అనుమతులు లేకపోయినా ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లతో కుమ్మక్కై, విచ్చలవిడిగా నడుపుతున్నారు అని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు రోగులు పట్టణ ప్రజలు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ఇప్పటికైనా డీఎంహెచ్ఓ స్పందించి తగు చర్యలు తీసుకొని డిమాండ్ వారు చేశారు.
కమీషన్లు కోసం ప్రయివేట్ డాక్టర్ల కక్కుర్తి :-జిల్లాలోని అన్ని పట్టణాలలో ఉన్న, ప్రైవేట్ డాక్టర్లు, పల్లెల్లో పనిచేసే ఆర్ ఎం పి లు సవేరా ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారని తెలిపారు. అందుకు వారికి ప్రతిఫలంగా ప్రతి ఆపరేషన్ పెషేంట్ కు ఛార్జ్ చేసే ఫీజ్లో 5నుండి 10 శాతం కమీషన్లు ఇస్తున్నారని తెలిపారు. అందుకే ప్రైవేట్ వైద్యులు కమీషన్ కోసం కక్కుర్తి పడి ప్రతి చిన్న ఆపరేషన్ను బూతద్దంలో చూపించి, రోగిని భయపెట్టి మరి ఆసుపత్రికి పంపించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. అదే కాకుండా, సి టి స్కాన్, ఎమ్మార్ ఐ స్కాన్ లో సైతం కమీషన్లు నొక్కుతున్నా రణి మండిపడ్డారు..అంతే కాకుండా రోగికి చేసే అన్ని రక్త పరీక్షల్లో పెద్ద దోపిడీ జరుగుతోందన్నారు. డాక్టర్ 50 శాతమునుండి 60 శాతము కమీషన్ తీసుకుంటున్నారని, వీటిపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న, మెడికల్ మాఫియాపై ఐ ఏ ఎస్ అధికారితో విచారణ చేపట్టి, మెడికల్ మాఫియాపై వేగవంతంగాచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img