Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. వారికి 21 శాతంతో పీఆర్సీ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన రెండ్రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగుల పే స్కేల్‌ను ప్రతి నాలుగేళ్లేకోసారి సవరించబడుతుందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం 2017- పేస్కేల్‌తో పోటు 2021- పేస్కేల్ సవరించాల్సి ఉందని చెప్పారు. పేస్కేల్ -2017 సవరణ గురించి ఉద్యోగుల నుంచి అభ్యర్థన వచ్చిందని.. దాంతో ప్రభుత్వం 20 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫిట్‌మెంట్‌ను ఏఫ్రిల్ 2017 నుంచి అమలు చేయబడుతుందని చెప్పారు. 01-01-2017 నాటి కరువు భత్యం 31.1 శాతాన్ని 01-04-2017 నుంచి పే స్థిరీకరణ గురించి విలీనం చేస్తామని చెప్పారు.ప్రస్తుతం సవరించిన వేతనాన్ని 2024 జూన్ 1 నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది. పేస్కేల్-2017 ఏరియర్స్ ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో వడ్డీ లేకుండా చెల్లి్స్తామన్నారు. ఉద్యోగుల పీఆర్సీతో ప్రభుత్వంపై ప్రతి ఏడాది రూ. 418.11 కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. ప్రస్తుత నిర్ణయంతో సర్వీసులో ఉన్న 42,057 మంది ఉద్యోగులకు, 2017 నుంచి పదవీ విరమణ చేసిన 11,014 మంది ఉద్యోగులు మెుత్తంగా 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img