Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

-ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
-వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి. హెచ్ కోటేశ్వరరావు

విశాలాంధ్ర-రాప్తాడు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తోందని…ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి. హెచ్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వ్య కా.స. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి
ఆర్.వెంకట్రావులతో కలిసి రాప్తాడు మండల కేంద్రంలోని పండమేరు వంకలో కూలీలు చేస్తున్న ఉపాధి పనులను గురువారం పరిశీలించి పనుల గురించి కూలీలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలన్నారు. బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.2.40లక్షల కోట్లు కేటాయించాలని దేశంలో నిపుణులు, కమ్యూనిస్టులు కోరితే రూ. 62వేల కోట్లు మాత్రమే పనికి ఆహార పథకానికి కేటాయించడం మన దేశ కూలీల దురదృష్టమన్నారు.. సమ్మర్‌ అలవెన్స్‌ ఇచ్చి, ఒక పూట మాత్రమే పనిచేసే విధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కనీస పని దినాలు 200 రోజులు తగ్గకుండా ఇవ్వాలన్నారు. వ్యవసాయ కూలీలు ఉపాధి పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం కూడా పూర్తిగా దెబ్బతిందని.. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఆసరాలా ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధిలో వెనుకబడ్డ ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ కూలీలు పనికి ఆహార పథకం మీద ఆధారపడి జీవిస్తున్నారని.. ఈ పేదరికాన్ని మరింత పెంచాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తీవ్ర రూపంలో ఆందోళనలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన కూలీలు 80 శాతం ఉన్నారనే ఉద్దేశంతో వారందరికీ కూలీలు తగ్గించాలని 2004లో యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని తెచ్చారంటే అది వామపక్షాలకే ఘనత అన్నారు. నాటి ప్రభుత్వం మద్దతు కోరిన వామపక్షాలను వ్యవసాయ కూలీలకు పనికి ఆహార పథకం కింద ఉపాధి కల్పించాలని నిబంధన పెట్టడంతో నేటి వరకు కూలీలు పనులకు వస్తుండడమే కారణమన్నారు.
రాజ్యాంగబద్ధంగా అమలైన ఈ చట్టాన్ని మోడీ తొలగించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఇదే జరిగితే దేశంలోని కోట్లాది కూలీలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. కూలీల వైపు పోరాటం చేయడానికి కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారన్నారని.. ఉపాధి హామీ పథకం కూలీలు దేశవ్యాప్తంగా కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. ప్రతి కూలీకి విడివిడిగా జాబ్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని ప్రభుత్వ పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం తొలగించడం సరైనది కాదని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలన్నారు గట్లు, చెక్ డ్యాములు తిరిగి ప్రారంభించాలన్నారు. జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ సాకే మునీంద్ర, మేట్ మల్లిక తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img