Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఓటమి భయం, ఓర్వలేనితనాలే దాడులకు కారణం

వంగవీటి రంగా హత్య తరహాలోనే జగన్ పై దాడి

హింసా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు

వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలు, పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రస్తుతం జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో మహాకూటమికి ఓటమి భయం ఓర్వలేని తనాల కారణంగా అధికార వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే గాక నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై రాళ్లదాడికి తెగబడడం ప్రతిపక్ష పార్టీల హింస రాజకీయాలకు నిదర్శనం అని వైకాపా అల్లూరు జిల్లా అధ్యక్షురాలు పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు. విజయవాడలో సిద్ధం సభలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై శనివారం చోటు చేసుకున్న రాళ్లదాడిని ఖండిస్తూ ఆ పార్టీ పరిశీలకుడు శ్రీకాంత్ రాజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలసి ఆమె పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే సత్తా లేని తెలుగుదేశం పార్టీ జనసేన, బిజెపి లతో కూటమిగా ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు హింసా రాజకీయాలకు తెరతీసాడన్నారు. నాడు కాపు ఉద్యమనేత వంగవీటి రంగాని ఏ మాదిరిగా హత్య గావించారో ఆ తరహాలోనే జగన్మోహన్ రెడ్డిపై నేడు దాడి జరిగిందన్నారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్షంలో ఉండడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఈ తరహా దాడి జరగడం చాలా బాధాకరమన్నారు. దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. అన్ని సర్వేల్లోనూ వైకాపా మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలుసుకొని, సిద్ధం బస్సుయాత్రకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఈ తరహా దాడులకు దిగుతున్నాయన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక దాడులు జరగడానికి వీలులేదని, ఇటువంటి దాడుల సంప్రదాయాన్ని భవిష్యత్తులో మరెవరూ కొనసాగించకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ దాడిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శ్రీకాంత్ రాజు, జడ్పిటిసి పోతురాజు బాలయ్య , ఎంపీపీ అనూష దేవి, సర్పంచ్ దురియ పుష్పలత, మండల ప్రెసిడెంట్ రవి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మీరా, మండల కోఆప్షన్ మెంబర్ నాజర్ వలి, వైస్ ఎంపీపీ లు శారద, వెంగళరావు, సర్పంచ్ లు పుష్పలత, లలిత, మహేశ్వరి, ఎంపీటీసీ లు, మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు సింహాచలం, రఘునాథ్ , నూకరాజు, గంగన్న పడాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img