Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పని గంటలు పెంచితే ప్రతిఘటన తప్పదు…

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్
విశాలాంధ్ర అనంతపురం (వైద్యం) : ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా అనంతపురము నగరంలో 138 వ మేడే ఉత్సవాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మేడే సందర్భంగా అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, కొత్తూరు లారీ యూనియన్ వద్ద ఆ యూనియన్ గౌరవాధ్యక్షులు నారాయణస్వామి, పాతూరు,కొత్తూరు హమాలీ యూనియన్ల వద్ద జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, పవర్ ఆఫీస్ వద్ద జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, మున్సిపల్ కార్యాలయం వద్ద నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, చర్చ్ సర్కిల్ ఆటో స్టాండ్ వద్ద జిల్లా కార్యదర్శి రాజు, లిక్కర్ గోడౌన్ వద్ద జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,మెడికల్ కళాశాల వద్ద నగర అధ్యక్షులు చిరంజీవి,సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద మెడికల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మేడే ఉత్సవాల్లో పాల్గొని ఏఐటీయూసీ జెండాలు ఎగరవేశారు,
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ కార్మికులు పర్వదినాన్ని పురస్కరించుకొని ఏ ఐ టి యు సి జెండాలను కార్మికులు పెద్ద ఎత్తున ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఎన్నో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు నిర్వహించి ప్రాణ త్యాగాలు చేసి బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో తొలగించడానికి ఆయన వ్యతిరేకించారు. రానున్న కాలంలో కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, సంక్షేమ బోర్డును అసంఘటిత కార్మికులందరికి ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మికుల కనీస వేతన బోర్డు వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. 44 కార్మిక చట్టాలను సవరణ చేసి తీసుకొచ్చిన నాలుగు లెబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. యాజమాన్యం టార్గెట్లు ఇవ్వడంతో పనిభారం పెరిగిపోయి దీనితోపాటుగా 15 గంటల పని చేయవలసిన విధానం వచ్చిందన్నారు,దీనివల్ల ఎక్కువ పని గంటలు చేయడంతో కార్మికులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతోందన్నారు. అందుకనే ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఇబ్రహీం,వేణు,శివకృష్ణ,భాగ్యమ్మ,అక్బర్,నారాయణ,రామాంజినేయులు,నాగరాజు,వెంకటేష్,మురళి,రాంబాబు,ప్రసాద్,నాగేంద్రబాబు,బాబు,భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img