Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్నికల్లో నరేంద్ర మోదీని, అతనితో అంటకాగుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి

అనంతలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా వేడుకలు..

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని 9 ఏళ్లుగా యువతను మోసం చేస్తున్న నరేంద్ర మోదీని అతనితో ఉన్న తొత్తు పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మాజీ రాష్ట్ర నాయకులు అనంతపురం అసెంబ్లీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి సీ జాఫర్ శుక్రవారం స్థానిక సుగుదేవ్ నగర్ తపోవనం 65వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో పిలుపునిచ్చారు .
అఖిల భారతీయ యువజన సమైక్య 65వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండాని ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు సిపిఐ అసెంబ్లీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి సీ.జాఫర్ మాట్లాడుతూ… ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని,నల్ల ధనాన్ని వెనక్కి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని యువతను, ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వేబీఎస్ఎన్ఎల్, బొగ్గు, పోర్ట్విమానయానం, విశాఖపట్నం స్టీల్ వంటి పరిశ్రమలను కార్పొరేట్లకు దారాదత్తం చేయడం ద్వారా దేశ సంపదను అంబానీ, అదానీకి దోచిపెట్టారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో నరేంద్ర మోదీని, అతనితో అంటకాగుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు.
మాజీ ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీరాములు,జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తీసుకువస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల ఆలోచన చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ను కార్పొరేట్ వ్యక్తులకు, బ్యాంకులకు తనఖా పెట్టారని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల 35 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తానని, మెగా డీఎస్సీ ప్రకటిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించలేదని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెగా డీఎస్సీ అంటూ అభ్యర్థులను దగా చేశారన్నారు. ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు జగన్ అతని పార్టీ వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే మార్గంగా నిరంతరం ప్రజల్లో ఉండే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మోహన్ కృష్ణ, సహాయ కార్యదర్శి రాకెట్ల, సహాయ కార్యదర్శి నగర అధ్యక్షుడు శ్రీనివాసులు బి.కేస్ మండల నాయకులు చాంద్ బాషా, రాజశేఖర్,నగర ఉపాధ్యక్షులు శ్రీకాంత్, షకీల్, ఆనంద్,మాజీ ఏఐవైఎఫ్ నాయకులు సుక దేవ నగర్ శాఖ జిలాన్ , నవ యుగ కార్యదర్శి రాజు, జాఫర్, పిరా నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img