Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

లారీ డ్రైవర్ల సమస్యలపై అండగా ఉంటాం

అనారోగ్యానికి గురైన లారీ డ్రైవర్ కు 10 వేలు ఆర్ధిక సహాయం అందించిన ఏఐటీయూసీ నాయకులు

విశాలాంధ్ర- అనంతపురం : లారీ డ్రైవర్లు & క్లీనర్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన అనంతపురము లారీ డ్రైవర్స్ & క్లీనర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) అండగా ఉంటుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి,యూనియన్ గౌరవాధ్యక్షులు నారాయణస్వామి తెలిపారు. శనివారం స్థానిక తపవనంలో ఉన్న లారీ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అనంతపురము లారీ డ్రైవర్స్ & క్లీనర్స్ యూనియన్ లోని సభ్యుడు చంటి ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి పాలైన నడవలేని పరిస్థిలో ఉన్నారు,ఆయన ఆరోగ్యం చూపించుకోవడానికి యూనియన్ తరపున 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి,యూనియన్ గౌరవాధ్యక్షులు నారాయణస్వామి మాట్లాడుతూ ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ నిత్యం కార్మికుల సమస్యలపై పోరాడుతూ వారి యోగక్షేమాలు కూడా చూస్తుందన్నారు. లారీ డ్రైవర్లు కుంటుంబాన్ని పోషించుకోవడానికి నిత్యం దూరప్రాంతాలకు సరుకు చేరవేసే పనిలోపడి వారి ఆరోగ్యాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాల్లో మరణించిన,గాయపడిన కార్మికులకు ఆర్థిక సహాయం చేస్తూ వారి కుంటుంబాలకు లారీ డ్రైవర్స్ యూనియన్ అండగా నిలబడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,యూనియన్ అధ్యక్షులు వెంకటేష్,కార్యనిర్వాహక అధ్యక్షులు మురళి,కమిటీ సభ్యులు రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img