Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పోలవరం పనులెలా?

. నేడు చంద్రబాబు పర్యటన
. ప్రాజెక్టు పనులపై అధ్యయనం
. దెబ్బతిన్న కట్టడాల పరిశీలన
. నిధుల విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం
. ఎన్డీఏలో కీలకంగా టీడీపీ
. నిధుల సాధనకు అనుకూలం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : జాతీయ హోదా కలిగిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్‌కు జీవనాడిగా నిలిచింది. విభజిత నవ్యాంధ్ర ప్రదేశ్‌ నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి ప్రశ్నార్థకంగానే మారుతోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మార్పుతో మళ్లీ పోలవరం ప్రస్తావన తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. సోమవారం పోలవరం సందర్శనకు సీఎం వెళ్లనున్నారు. దీంతో పోలవరం పనులు మళ్లీ మొదటికి వస్తాయా? లేక ఉన్న పరిస్థితి నుంచే కొనసాగిస్తారా? అనేదీ ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా ఉంటుంది. 20142019 హయాంలోను ప్రతి సోమవారం… పోలవరంపై చంద్రబాబు సమీక్షలు నిర్వహించిన విషయం విదితమే. విద్యార్థులు, యువత, మహిళలను పోలవరం సందర్శనకు తీసుకెళ్లారు. అనంతరం టీడీపీ అధికారం కోల్పోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు పూర్తికాపోవడం, పనులు మందగించడం వెరసి విమర్శలపాలైంది. ఇప్పుడు కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో పోలవరం పనులు, దానికి కావాల్సిన నిధుల విడుదలకు తగినంత అనుకూల వాతావరణం ఏర్పడిరది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సరిపడా బలం లేదు. ఏపీ నుంచి ఎన్డీఏ కూటమి ఎంపీల బలంతోనే ప్రధానిగా మోదీ కొనసాగే దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంగానీ లేక భాగస్వామ్య పార్టీ చొరవతో నిధులు తెప్పించే అవకాశం మరోసారి టీడీపీకి కలిగింది. 2014లోనూ ఎన్డీఏ కూటమితో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ… పోలవరం ప్రారంభ దశ కావడంతో ఆ పనులు పూర్తికాలేదు. ఆ తర్వాత టీడీపీ అధికారం కోల్పోయింది. మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలవరం పర్యటనకు వెళ్లనుండటం చర్చనీయాంశంగా మారింది. పోలవరం పూర్తి చేయాలన్న చంద్రబాబు కాంక్షను విపక్షాలు స్వాగతిస్తున్నాయి. దాంతో పాటు చంద్రబాబు తన పర్యటనలో పోలవరం నిర్వాసితుల కాలనీలను, ప్రజలను కలసి వారి సమస్యలను సత్వర పరిష్కారం చేయాలని, పునరావాస ప్యాకేజీకి కృషికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.
పోలవరం పనుల అంచనాలు పెరుగుతాయా?
పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించిన నాటి కాలంతో పోలిస్తే… ప్రస్తుతం ఉన్న వాటి నిధుల అంచనాలు పెరిగే అవకాశం ఉంది. దీనిపైనా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించే అవకాశముంది. రెండో డీపీఆర్‌ మంజూరు 2019లో చంద్రబాబు అధికారం నుంచి దిగే నాటి పరిస్థితే ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం డీపీఆర్‌ను రూ.55,658 కోట్లకు కేంద్ర జల సంఘం ఆమోదించింది. అనంతరం రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ రూ.47,725.74 కోట్లకు ప్రతిపాదించింది. వాటిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. గత సీఎం జగన్‌ ప్రభుత్వ హయాంలో తొలి దశ నిధుల కింద 41.15 మీటర్ల స్థాయి పునరావాసం, భూసేకరణ, కట్టడాల తదితర అంశాలపై రూ.31,625 కోట్లకు కేంద్ర జలసంఘం ప్రతిపాదించింది. ఆ నిధులతో పోలవరం పూర్తి చేయడం అసాధ్యమన్న వాదనలున్నాయి. ధ్వంసమైన కాఫర్‌డ్యామ్‌తో పాటు మిగిలిన వాటిన్నింటికి కలిపి అదనంగా నిధులు సాధించాల్సిన అవసరం ఉంది. పోలవరంలో ప్రధానంగా నిలిచిన డయా ఫ్రమ్‌ వాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు, గైడ్‌ బండ్‌, గ్యాప్‌ 1 ప్రధాన డ్యామ్‌ తదితర నిర్మాణాల పరిస్థితిపై అధ్యయనం చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా డయా ఫ్రమ్‌ వాల్‌ నిలుస్తుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విదేశీ కంపెనీలతో దీనిని నిర్మించగా, 2022లో వచ్చిన వరదలతో ఇది ధ్వంసమైంది. దీంతో కొత్త డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని జాతీయ జలవిద్యుత్‌ పరిశోధనా కేంద్రం సూచించింది. పోలవరంలో ప్రస్తుత సవాళ్లను, సమస్యలను అధిగమించాలంటే అంతర్జాతీయ అనుభవమున్న నిపుణులు అవసరమని కేంద్ర జల సంఘం తెలిపింది. పోలవరంలో స్పిల్‌వే పై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకుగాను గైడ్‌ బండ్‌కు కేంద్ర సంస్థలు ప్రతిపాదించాయి. చంద్రబాబుతో పాటు జలవనరుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, నిపుణులు వెళ్లి ప్రస్తుత ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన పనులు, ముగిసిన వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన పనుల పైన అంచనాలు వేయనున్నారు. ప్రస్తుత చంద్రబాబు పర్యటనతో పోలవరంపై ప్రాధాన్యత ఏర్పడిరది. ఆ మేరకు చంద్రబాబు ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ చూడాలి.
అడుగడుగునా కేంద్రం నిర్లక్ష్యం
విభజిత ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి పోలవరంతో పాటు రాష్ట్రాభివృద్ధికి నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తీవ్ర వివక్ష చూపారు. నాడు రాజ్యసభలో మూడేళ్ల క్రితం టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ పోలవరం పనులపై అడిగిన ప్రశ్నకు… ఏప్రిల్‌ 2022కు పోలవరం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఆథార్టీ సవరించిన షెడ్యూలు మేరకు ఆయనకు వివరాలను అందజేశారు. ఏయే పనులు ఎప్పటికి పూర్తవుతాయనేదీ తెలుపుతూ, మే 2022 నాటికి పనులు, ఏప్రిల్‌ నాటికి గేట్ల పనులు పూర్తవుతాయని ఆయన ప్రశ్నకు బదులిచ్చారు. అదే ఏడాది జూన్‌ నాటికి పోలవరం కాఫర్‌ డ్యామ్‌ పూర్తవుతుందని వెల్లడిరచారు. భూ సేకరణ, పునరావాస పనులు అదే సమయానికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే గత ఐదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినప్పటికీ, పోలవరం పూర్తి చేయడానికి కృషి జరగలేదు. ప్రధాని మోదీని గత సీఎం జగన్‌ అనేక సార్లు దిల్లీలో కలిసినప్పటికీ… పోలవరం పూర్తికి అవసరమైన నిధుల విడుదలలో జాప్యం జరిగిందన్న విమర్శల ున్నాయి. అటు కేంద్రం చేసిన హామీని సైతం నెరవేర్చలేదు. వాటన్నింటినీ టీడీపీ పరిగణనలోకి తీసుకుని పోలవరం పూర్తిచేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే పోలవరం పరిస్థితి మళ్లీ మొదటికి రానుంది. ఈ పర్యటన అనంతరం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం పనులపై ప్రభుత్వం తన విధానపరమైన నిర్ణయాలు, కార్యాచరణ వెల్లడిరచే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img