హాస్టల్ సూపర్డెంట్ పద్మ రాధిక
విశాలాంధ్ర -ధర్మవరం:; పట్టణములోని సిద్ధార్థ థియేటర్ పక్కన ఎల్పీ సర్కిల్లో గల బాలసదనంలో ఉచిత ప్రభుత్వ బాలికల వసతి గృహమును నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని ఆశలు సూపర్డెంట్ పద్మ రాధిక తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా వసతి గృహంలో తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు, తల్లిదండ్రులలో ఒకరు ఉండి, మరొకరు లేని ఆడపిల్లలకు, నిరుపేద కుటుంబాల ఆడపిల్లల కొరకు ఈ బాలసదనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు అధికారుల యొక్క ఆదేశాను ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ హాస్టల్లో ప్రవేశాలు పూర్తిగా ఉచితమని తెలిపారు. మా హాస్టల్ లో ఉచిత విద్యతో పాటు వైద్యము, ట్యూషన్ కూడా చెప్పించబడునని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణం,ఆటలు, లైబ్రరీ కలదని తెలిపారు. మెనూ ప్రకారం మంచి భోజనం,వసతి కల్పించబడునని తెలిపారు. అన్ని కులముల వారికి అన్ని మతముల వారికి పూర్తిగా ఉచిత ప్రవేశం కలదని తెలిపారు. ఆరు సంవత్సరాల నుండి 11 సంవత్సరాల ఆడపిల్లలకు మాత్రమే ప్రవేశం కలదని అనగా ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువు కూడా చెప్పించబడునని తెలిపారు. అడ్మిషన్లు ప్రారంభం కావడం జరిగిందని, తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను ఈ హాస్టల్లో చేర్పించాలని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 7989121174 కు గాని 9490476222 గాని సంప్రదించాలని తెలిపారు.