Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

తప్పిపోయిన మహిళను కుటుంబ సభ్యులకు అందించిన ధర్మవరం ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ లు

విశాలాంధ్ర ధర్మవరం:: అన్నమయ్య జిల్లా తాటి గుంటపాల్యానికి సంబంధించిన 60 సంవత్సరాల రెడ్డమ్మ నాలుగు సంవత్సరాల క్రిందట రైలులో తప్పిపోయింది. ఈ విషయాన్ని కుమారుడు గురు శేఖర్ ఈనెల 24వ తేదీన ధర్మవరం పోస్టులో ఆపరేషన్ డిగ్నిటీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే ఆర్పిఎఫ్సిఐ బోయ కుమార్ మాట్లాడుతూ ఇదే రోజు ఆర్పీఎఫ్ పోలీసులు ఈ కేసును చేదించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది అని, రైలు నెంబర్ జీరో 07656 తిరుపతి- గుంతకల్ ప్యాసింజర్ లో ఆర్ఎంసి నెంబర్ 2024062405917 గా నివేదించబడింది అని తెలిపారు. కుమారుడు గురు శేఖర్ ఆ ప్యాసింజర్ రైలులో తన తల్లి తప్పిపోయింది విషయాన్ని తెలుపుతూ, రైల్లో ఉన్నట్టు తెలపడం జరిగిందని, సమాచారం అందుకున్న వెంటనే ఏఎస్ఐపిఎఫ్ వెంకటరావు తన సిబ్బందితో కలిసి ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద రైలు వచ్చే సమయానికి రావడం జరిగిందన్నారు. తదుపరి ఆ రైలు నుండి ఆ మహిళను రక్షించి కుమారుడు గురు శేఖర్ కు సమాచారాన్ని అందించడం జరిగింది అని తెలిపారు.మహిళను రెడ్డమ్మ గా గుర్తించి 24వ తేదీ రైల్వే కాలమాన ప్రకారం 18 గంటలకు ధర్మవరం పోలీస్స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు. గురు శేఖర్ తెలిపిన మేరకు తన తల్లి నాలుగు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫోటో ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఆ ఫోటోను ఆధారంగా చేసుకుని రెడ్డమ్మను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నాలుగు సంవత్సరాలు తర్వాత తన తల్లి రెడ్డమ్మ కనబడడంతో ఆనందముతో పొంగిపోయారు. తన తల్లిని రక్షించడంలో ధర్మవరం ఆర్ పి ఎఫ్ అధికార, సిబ్బంది బృందం చేసిన కృషిని వారు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక తల్లిని కుమారుని చెంత చేర్చుటలో ధర్మవరం ఆర్పిఎఫ్ పోలీసులు సమర్థవంతమైన ప్రతిస్పందన అంకితభావం ప్రభావానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటికే పలు కేసులు మానవతా దృక్పథంతో రైల్వే చట్టం ప్రకారం ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రయాణికుల వద్ద ధర్మవరం ప్రజల వద్ద మంచి గుర్తింపు పొందడం జరిగింది. ఒక తల్లిని కుమారుని చెంతకు చేర్చడంలో రైల్వే పోలీసులు చేసిన కృషిని పట్టణ ప్రజలు, రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img