Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రజలందరూ కూడా సీజనల్ వ్యాధుల పట్ల తప్పక అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యమును పదిలం చేసుకోవాలని మునిసిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలు విషయాలను వారు తెలియజేస్తూ ప్రస్తుతం జిల్లాలో డయేరియా అనే వ్యాధి రావడం జరుగుతోందని, డయేరియా అనగా వాంతులు, బేదులు అధికంగా కావడం అని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఇంటిని కూడా పరిశుభ్రం చేసుకోవాలన్నారు. బయట పెట్టే తొట్టిలో నీరు నిల్వ ఉండరాదని, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలనే తెలిపారు. తాగునీటిని వేడి చేసి, చల్లార్చి ,తాగాలని తెలిపారు. బయట ఫాస్ట్ ఫుడ్ను తినే అలవాటును చాలా తగ్గించుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి అని, లేనియెడల అనారోగ్యం చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రమే భుజించడం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు. సాధ్యమైనంతవరకు ఇంటిలోని ఆహారాన్ని మాత్రమే తినేలా అందరూ అలవాటు చేసుకోవాలని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రభలు తాయని, ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని, వైద్యుల యొక్క సలహా సూచనలు తప్పక అమలు చేయాలని తెలిపారు. దోమల నివారణ పై దోమతెరలు వాడుట, వేపాకు పొగను వేసుకొనుట లాంటివి చేసినప్పుడు అనారోగ్యాలు దరిదాపున చేరవు అని తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలలో డయేరియా కేసులు ఉండడం జరుగుతోందని, సంబంధిత వైద్యులు కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఇప్పటికే తాము పట్టణంలోని పలు వార్డులలో పారిశుధ్యం పైన ప్రత్యేక దృష్టిని సాధించడం జరిగిందని తెలిపారు. ఏ వార్డులోనైనా సరే చెత్తాచెదారం ఉన్న యెడల పురపాలక కార్యాలయమునకు సమాచారాన్ని అందించిన, తక్షణమే చర్యలు తీసుకోబడునని తెలిపారు. బేదులు, వాంతుల వల్ల కలిగే ప్రాణనష్టాన్ని ఆపుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓ ఆర్ ఎస్ ను తప్పక సేవించాలని జింక్ కార్నర్ తో ఇప్పుడు నీళ్ల విరోచనాలు మటుమాయం అవుతాయని తెలిపారు. విరోచనాలు మొదలైన వెంటనే ఓఆర్ఎస్ ను సాగించాలని తెలిపారు. కుటుంబంలోని చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన శ్రద్ధను తప్పక కనబరచాలని తెలిపారు. కావున పట్టణంలోని 40 వార్డుల ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ, పట్టణ ప్రభుత్వ ఆసుపత్రులలోనూ విరి వెంటనే వైద్య చికిత్సలు పొందాలని వారు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img