Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

జిల్లాలో డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా కృషి చేద్దాం: మన్యంజిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

విశాలాంధ్ర – పార్వతీపురం : యువతపై మాదకద్రవ్యాలప్రభావం పడకుండా అరికడదామని, జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ లక్ష్యమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే ను పురస్కరించుకొని జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆద్వర్యంలో మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీనీ ప్రారంభిచారు. ఈర్యాలీనీ పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మెయిన్ రోడ్ గుండాఎస్బిఐ బ్యాంక్ వరకు నిర్వహించారు.
జిల్లాలో మాదకద్రవ్యాలు వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు గురించి జిల్లా అంతట అవగాహన ర్యాలీలు నిర్వహించామన్నారు.జిల్లాలో యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అన్ని స్కూళ్లు మరియు కాలేజీల వద్ద ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు జిల్లా అంతట ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాదకద్రవ్యాల(డ్రగ్స్) వినియోగం, వాటి దుష్ప్రభావాలను గురించి అవగాహన కలిగించడం జరిగినదన్నారు.
మాదకద్రవ్యాలు వినియోగం వలన సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, అందుకే దేశభవిష్యత్తును కృంగదీసే మాదకద్రవ్యాలను పకడ్బందీగా అరికడదామన్నారు. ప్రతీఏటా జూన్ 26న మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. యువతను చెడు మార్గం వైపు నడిపించే మాదకద్రవ్యాలు అమ్మకాలు లేదా వినియోగించిన వారి గురించి సమాచారం ఇచ్చి డ్రగ్స్ నివారణలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు.మాదకద్రవ్యాలు అమ్మకాలు లేదా వినియోగించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈఅవగాహన ర్యాలీలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ డా ఓ. దిలీప్ కిరణ్, ఏ ఎస్పీ సునీల్ షరోన్ పార్వతీపురం పట్టణ సి.ఐ., పి.వి.వి.ఎస్.ఎన్.కృష్ణారావు , పార్వతీపురం పట్టణ ఎస్ఐ బి. రవీంద్ర రాజు ఇతర అధికారులు, సిబ్బంది మరియు కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img