Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల జాతర

మండలంలోని 17 పంచాయతీల పరిధిలో 9551 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది.

పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్డీఏ కూటమి నాయకులు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల జాతర మొదలైంది. సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పెన్షన్ పథకాన్ని 4 వేల రూపాయలకు పెంచడంతోపాటు ఏప్రిల్, మే, జూన్ మాసాలతో కలుపుకుని 7000 రూపాయల పెన్షన్ ఒక్కసారిగా అందుకోవడంతో పెన్షన్ లబ్ధిదారులలో ఆనందం వెళ్లి విరిసింది. ఈ క్రమంలో మండలంలోని 9551 పెన్షన్లకు సంబంధించి మండలంలోని 17 పంచాయతీల పరిధిలోని 22 పరిధిలో సచివాలయ సిబ్బంది కూటమి పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. మండలంలోని పెద్ద బరడ పంచాయతీలో అత్యధికంగా 789 పెన్షన్ లబ్ధిదారులు ఉండగా అత్యల్పంగా చింతపల్లి 3 సచివాలయంలో 218 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి తెదేపా నాయకులు పాలాభిషేకం చేసి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా మండల కేంద్రంలో తెదేపా మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు, ఆండ్రాబు లక్ష్మణ్ ఆధ్వర్యంలోనూ, లంబసింగిలో తెదేపా ఉపాధ్యక్షుడు కిముడు లక్ష్మయ్య ఆధ్వర్యంలోనూ, కొమ్మంగి పంచాయతీలో తెదేపా నాయకుడు సురేష్, బుజ్జిబాబుల ఆధ్వర్యంలోనూ, బెన్నవరం పంచాయతీలో ఆ పంచాయతీ సర్పంచ్ బచ్చల సన్యాసమ్మ, మాజీ సర్పంచ్ సలభం కర్రి నాయుడు, మాజీ ఎంపిటిసి సలభం కంఠం నాయుడు ల ఆధ్వర్యంలోనూ, తమ్ముంగుల కుడుముసారి పంచాయతీలలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img