Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఇచ్చిన హామీని అక్షరాలా నిజం చేసే ప్రభుత్వం తెదేపా

అన్నవరం, లోతుగెడ్డ సర్పంచ్ లు సన్యాసిరావు, సునీల్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఇచ్చిన హామీనే అక్షరాలా నిజం చేసే ప్రభుత్వం తెదేపా ప్రభుత్వమని అన్నవరం, లోతుగెడ్డ సర్పంచ్ లు సన్యాసిరావు, సునీల్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అన్నవరం, లోతుగెడ్డ సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో అన్నవరం పంచాయతీలోని గాలిపాడు గ్రామంలో సర్పంచ్ సన్యాసిరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కేసుబాబు, నా ఆధ్వర్యంలోను, లోతుగెడ్డ సచివాలయ కేంద్రంలో ఆ పంచాయతీ సర్పంచ్ సునీల్, ఎంపీటీసీ సభ్యుడు బాబురావుల ఆధ్వర్యంలోనూ పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులకు 7వేల రూపాయల పెన్షన్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీని నిజం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పెంచుకుంటూ పోయే తత్వం వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దని, ఇచ్చిన హామీని ఏకకాలంలో నెరవేర్చే తత్వం చంద్రబాబు నాయుడుదని ఈ సందర్భంగా వారు కొనియాడారు. పెన్షన్ పంపిణీ తో ప్రతి ఇంట ఆనందం వెళ్లి విరుస్తుందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేసి చూపే సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందని తెలుగుదేశం ప్రభుత్వంలోనే అది సాధ్యమని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన నాయకులు, సచివాలయ సిబ్బంది, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img