Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పేద ప్రజలందరికీ కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. లయన్స్ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలందరికీ కంటి వెలుగులు ప్రసాదించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలచార్యులు, కార్యదర్శి ఆకులేటి రమేష్ బాబు, కోశాధికారి ఉలవల నాగేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణములోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజ, సీనియర్ జర్నలిస్టు అనంతపురం మార్కండేయులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరుపు రానివని, అలాంటి లైన్స్ క్లబ్ ధర్మవరం పట్టణంలో ఉండడం పేద ప్రజలకు ఒక వరంలాగా మారిందని తెలిపారు. ఈ లైన్స్ క్లబ్ సేవలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు వేణుగోపాలచార్యులు, కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి ఉలవల నాగేంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం లైన్స్ క్లబ్ పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడంలో కీలకపాత్ర పోషిస్తూ, పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించుటలో నిరంతరం తాము కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే దాదాపు 70 వేలకు పైగా పేద ప్రజలకు ఉచిత ఆపరేషన్తో పాటు ఉచితంగా కంటి అద్దాలను కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. దాతల సహాయ సహకారంతోనే ఈ శిబిరాలు నిర్వహించటం మాకెంతో సంతోషాన్ని సంతృప్తి ఇచ్చిందని తెలిపారు. క్యాంపు దాతగా శ్రీరాములు ను, ముఖ్య అతిధులను లయన్స్ క్లబ్ కమిటీ వారు ఘనంగా సత్కరించారు. ఈ కంటి శిబిరానికి 92 మంది రోగులు పాల్గొనగా, అందరికీ వైద్య చికిత్సలు అందించగా అందులో 55 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగింది అన్నారు. వీరందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్లు కంటి అద్దాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లెం వేణు గోపాల్, మోహన్దాస్, రాజగోపాల్, రాధాకృష్ణ, పుట్లూరు నరసింహులు, చందా నాగరాజు, వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img