Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రెక్కలు విరిగిన పక్షి కశ్మీర్‌

సరిగ్గా అయిదేళ్ల ఒక్క రోజు కింద మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేసిన తరవాత జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రమే భారత రాజకీయ చిత్రపటం మీంచి చెరిగి పోయింది. ప్రస్తుతం ఉన్నదల్లా జమ్మూ-కశ్మీర్‌, లడాఖ్‌ అనే రెండు నిర్జీవమైన కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే. 370 వ అధికరణం కారణంగానే ఆ రాష్ట్రంలో తీవ్రవాదం ప్రబలిందని, 370 వ అధికరణం రద్దు వల్ల దేశమంతటికీ వర్తించే చట్టాలు జమ్మూ-కశ్మీర్‌, లడాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 370 వ అధికరణం రద్దు ప్రతిపాదిస్తున్నప్పుడు ఇల్లెక్కి అరిచినట్టు చెప్పారు. 370 వ అధికరణం రద్దుచేసి అర దశాబ్దం గడిచింది. మునుపటి జమ్మూ-కశ్మీర్‌ ప్రజల పరిస్థితిలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఇసుమంత మార్పు కూడా కనిపించడం లేదు. పైగా మునుపటికన్నా జనాభిప్రాయాన్ని నొక్కేయడం మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 370 వ అధికరణాన్ని రద్దు చేయడానికి ముందు అరెస్టు చేసిన ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ నాయకులను కొన్నాళ్ల తరవాత విడుదలచేసి ఉండొచ్చు. అసలు వీరిని అరెస్టే చేయలేదని మోదీ ప్రభుత్వం బుకాయించింది. కానీ వారు తమ ఇళ్ల ప్రహారీ గోడ దాటి బయటకు తొంగిచూసే అవకాశం కూడా లేకుండా చేశారు. 370 వ అధికరణం రద్దు చేసినందువల్ల జరిగిందల్లా అంతవరకు సాపేక్షికంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ, లడాఖ్‌ ప్రాంతంలోనూ ఇప్పుడు తీవ్రవాదులు వీర విహారం చేస్తున్నారు. దీన్ని ఆపడం కేంద్ర ప్రభుత్వం తరం కావడంలేదు. 370 వ అధికరణాన్ని రద్దు చేస్తే జమ్మూ-కశ్మీర్‌ పరిస్థితి గణనీయంగా మారిపోతుందని, దేశమంతటి లాగే ఆ ప్రాంతం కూడా భారత్‌లో సమ్మిళితం అవుతుందని మోదీ ప్రభుత్వం ప్రచారం చేసింది. అక్కడ వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికీకరణ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ ఛాయలేవీ అయిదేళ్ల తరవాత కూడా కనిపించడం లేదు. చివరకు స్థానిక బీజేపీ నాయకులు కూడా 370 వ అధికరణం రద్దును బాహాటంగా కీర్తించలేక పోతున్నారు. అంతకు ముందు లడాఖ్‌ ప్రజలు తాము విడిగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతమైన తరవాత అంతకు ముందున్న పరిస్థితే మెరుగ్గా ఉందంటున్నారు. 370 వ అధికరణం రద్దు కాకముందు కేవలం కశ్మీర్‌ లోయ ప్రాంతంలోని ప్రజల్లోనే అసంతోషం, ఆగ్రహం కనిపించేది. ఇప్పుడు లడాఖ్‌, జమ్మూ ప్రాంత ప్రజల్లోను అసంతృప్తి పెల్లుబుకుతోంది. అయితే సర్వమూ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందువల్ల, జనం నోరు విప్పే అవకాశం లేనందువల్ల, పత్రికలు నామమాత్రంగా మిగిలిపోయినందువల్ల అసలు పరిస్థితి ఏమిటో అంతుపట్టడం లేదు. దిల్లీలో కొలువుదీరిన ప్రభుత్వంపై 370 వ అధికరణం రద్దుకు ముందు ఉన్న వ్యతిరేకత భిన్నమైంది కావచ్చు. ఇప్పుడు అసంతృప్తి మూడు ప్రాంతాలలోనూ భయానకంగా తయారైంది. వ్యక్తీకరణకు అవకాశం లేనందువల్ల అసలు విషయం బయటకు పొక్కడం లేదు. తమను నిరాశ పరిచారన్న అభిప్రాయం సర్వత్రా కనిపిస్తూనే ఉంది. ఈ అభిప్రాయం బాహాటంగా వ్యక్తం కాకపోవడానికి కారణం మోదీ ప్రభుత్వం ఆ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలను చెప్పుకింద తేలులా అణచిపెట్టడమే.
స్పష్టంగా కనిపిస్తున్న తేడా ఏమైనా ఉంటే అది కశ్మీర్‌ స్వతంత్రం కావాలన్న ఆకాంక్ష బహిరంగంగా వ్యక్తం కావడానికి అవకాశం లేకపోవడమే. భారత ప్రభుత్వ వ్యతిరేక రాతలు గోడల మీద కనిపించకపోవడమే. అంతకు ముందు కశ్మీర్‌కు ఉన్న పతాకం మాయమై పోయింది. ఇప్పుడు అన్నిచోట్ల త్రివర్ణ పతాకం రెప రెపలు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ భవనాల మీద, గంట స్తంభాల మీద, వాట్సాప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులు పంపే సందేశాల మీద జాతీయ పతాకం దర్శనం ఇస్తోంది. చివరకు చినార్‌ చెట్ల బోదెల మీదా జాతీయ పతాకం రంగులద్దడం గోచరిస్తోంది. వాజ్‌పేయి నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం కుదర్చడానికి సంప్రదింపులజాడ కనిపించేది. 370 వ అధికరణం రద్దు తరవాత స్థానిక ప్రజలతో, రాజకీయ నాయకులతో మోదీ ప్రభుత్వం చర్చలు జరిపిన ఉదంతమే లేదు. అనేక ఏళ్ల నుంచి ‘‘కశ్మీర్‌ భారత్‌ లో అంతర్భాగం’’ అని నినదించని ప్రభుత్వమే లేదు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం అన్న భావన ముందు నుంచే ఉన్నప్పటికి మోదీ ప్రభుత్వం ఈ లక్ష్య సాధన కోసమే 370 వ అధికరణాన్ని రద్దు చేశామని బాకా ఊదుకుంటోంది. 2019 తరవాతే కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమైనట్టు బుకాయిస్తోంది. దేశమంతటికీ వర్తించే చట్టాలు కశ్మీర్‌కు కూడా వర్తిస్తాయని మోదీ సర్కారు ఎంత గట్టిగా ప్రచారం చేసిన అక్కడి ప్రజల భద్రతా చట్టాన్ని తొలగించనే లేదు. పైగా దీన్ని ఒక ఆయుధంగా వినియోగిస్తోంది. కాలం చెల్లిన అనేక చట్టాలను తవ్వి తీసి అమలు చేస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర ప్రతిపత్తిని త్వరలోనే పునరుద్ధరిస్తామన్న మోదీ, అమిత్‌ షా వాగ్దానం హిమాలయ పర్వత సానువుల్లో గడ్డ కట్టుకుపోయింది. అక్కడ శాసనసభను పునరుద్ధరిస్తామని చెప్పిన మాటను మోదీ సర్కారు వాటంగా మరిచిపోయినట్టుంది. రాష్ర ్టప్రతిపత్తి పునరుద్ధరించకుండా ఎన్నికలు నిర్వహించినా సకల విషయాలు దిల్లీ పీఠాధిపతుల గుప్పెట్లోనే ఉంటాయి. స్థానిక ప్రజలకు గోరంత అధికారం ఉదాహరణ ప్రాయంగా అయినా స్థానికులకు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 లోగా అక్కడ ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశం కూడా మోదీ అమలు చేసే ఆనవాళ్లే కనిపించడం లేదు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ లో వచ్చే నవంబర్‌ లో శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. కానీ కశ్మీర్‌ ఊసే లేదు. జమ్మూ-కశ్మీర్‌ లో ఆఖరుసారి 2014 లో ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి ఆరేళ్లయింది. రాష్ట్ర ప్రతిపత్తి లేకుండా జమ్మూ-కశ్మీర్‌లో అసెంబ్లీని పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించినా ప్రయోజనం పూజ్యం. సర్వాధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతిలో అంటే మోదీ ప్రభుత్వం గుప్పెట్లోనే ఉంటాయి. 370 వ అధికరణం రద్దు తరవాత కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్మూ-కశ్మీర్‌ లోని లోకసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన మాట నిజమే. జమ్మూలో బీజేపీ అభ్యర్థి చావుతప్పి కన్ను లొట్ట పోయిన రీతిలో గెలిచారు. లడాఖ్‌లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ మూడో స్థానంలో చతికిలపడిరది. కశ్మీర్‌ లోయలో ఉన్న స్థానాల్లో బీజేపీ పోటీచేసే సాహసమే చేయలేకపోయింది. అంటే అక్కడ పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడలేదని బీజేపీకి తెలిసినా బీరాలు పలుకుతోంది. బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులందరూ ఘోరంగా ఓడిపోయారు. వ్యక్తిగతంగా కూడా ప్రజలు మనసువిప్పి మాట్లాడే పరిస్థితి లేదు. కేంద్రం నిఘా నేత్రాలు సర్వవ్యాప్తమైనాయి. వ్యాపారాలు, కాంట్రాక్టులు ఇతర ప్రాంతాల వారికే కట్టబెడ్తున్నారు. వారికి విస్తారంగా భూములు కేటాయిస్తున్నారు. స్థానికులలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఉన్న జీవనోపాధీ పోతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img