Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రశ్నలు మిగిల్చిన వినేశ్‌ ఉదంతం

వినేశ్‌ ఫొగాట్‌కు ఇక ఏ పతకమూ దక్కదు. ఆమె ఫైనల్‌లో ఆడడానికి అర్హత లేకుండా పోయింది. ఆమె పాల్గొంటున్న కుస్తీ పోటీల ప్రక్రియలో ఉండవలసిన బరువు కన్నా వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారట. అందువల్ల ఆమెకు కనీసం రజత పతకం దక్కే అవకాశమూ లేకుండా పోయింది. ఆమె సెమీ ఫైనల్‌లో విజయం సాధించి ఫైనల్‌లో ప్రవేశిస్తారనుకున్న సమయంలో అన్ని ఆశలూ మాయమైపోయాయి. ఆమె శరీరంలో నీటి శాతం తగ్గినందువల్ల ఆసుపత్రిలో చేర్పించారట. వినేశ్‌ ఫొగాట్‌ ప్రపంచంలోనే చరిత్ర లిఖించబోతున్నారనుకున్న సమయంలో ఆమె అనర్హురాలు కావడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కేవలం వినేశ్‌కు ఎదురైన ఇబ్బందో, అపజయమో కాదు. మొత్తం దేశం ఈసారి ఆమె స్వర్ణపతకం సాధిస్తుందని దేశవాసులు పెట్టుకున్న ఆశలు పటాపంచలైనాయి. వంద గ్రాముల బరువు ఎక్కువైందన్నది కేవలం సాంకేతిక కారణమే. దీనివల్ల భూమ్యాకాశాలు తల కిందులైపోయే ప్రమాదం ఏమీలేదు. సాంకేతిక అంశాలు ఎలా ఉన్నప్పటికీ వినేశ్‌ ఫొగాట్‌ను చివరి నిమిషంలో ఫైనల్‌ నుంచి తప్పించడమే కాక, బరువు ఎక్కువ అయిందన్న కారణంగా కనీసం రజతం కూడా దక్కకుండా పోవడం చూస్తే ఆమె దంగల్‌లో ఓడిపోలేదని, కుట్ర ద్వారా ఆమెను పోటీలో పాల్గొనకుండా చేశారన్న అభిప్రాయం సగటు భారతీయులు కూడా నమ్ముతున్నారు. ఈ కుట్రకు బాధ్యులెవరో కనిపెట్టడానికి దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ పార్లమెంటులో డిమాండు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు రాకేశ్‌ టికైత్‌ కూడా ఇందులో ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సంజయ్‌ సింగ్‌ అయితే ఆమెకు ఫైనల్‌లో ఆడే అవకాశం కల్పించాలని అభ్యర్థించాలని లేకపోతే ఒలింపిక్‌ క్రీడలను బహిష్కరించాలన్నారు. ఒలింపిక్‌ క్రీడా నియమాలు కచ్చితంగానే ఉంటాయి. వినేశ్‌ అంత్యదశలో క్రీడాంగణం నుంచి వైదొలగడానికి ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనన్నదే అసలు వివాదం. వినేశ్‌ ఫొగాట్‌ను పనిగట్టుకుని తప్పించారన్న గట్టి ఆరోపణలైతే నలు దిక్కుల నుంచి వినిపిస్తున్నాయి. భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు, శక్తిమంతుడైన అప్పటి బీజేపీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ క్రీడా కారిణులపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 2023లో మహిళా మల్ల యోధులు దిల్లీలో వారాల తరబడి నిరసన తెలియజేశారు. ఈ ఆందోళనలో ఫొగాట్‌ చాలా క్రియాశీల పాత్ర నిర్వహించారు. ఆ కసితో బీజేపీ ఏదైనా కుట్ర పన్నిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఒక్క రాత్రిలో ఆమె బరువు వంద గ్రాములు ఎలా పెరుగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత సంవత్సరం ఆందోళన ఉధృతంగా జరుగుతున్న సమయంలో ప్రభుత్వం దిగి వచ్చి బ్రిజ్‌ భూషణ్‌ శర్మపై చర్యలు తీసుకోకపోతే తాను అంతవరకు సాధించిన పతకాలన్నింటినీ గంగానదిలో పడవేస్తానని ఫొగాట్‌ అనడం వెనక ఎంత ఆందోళన ఉండి ఉంటుందో. ఇప్పుడు ఆమె ఫైనల్‌లో ఆడే అవకాశం కోల్పోయినందుకు దేశ ప్రజలందరూ అంతే వ్యధా భరితులై ఉన్నారు. కొన్నిసార్లు తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తే అది నిజమేనని ఒలింపిక్‌ సంఘం అంగీకరిస్తే పతకం దక్కనూ వచ్చు. కానీ ఇప్పుడు ఫొగాట్‌ కు ఆ అవకాశమూ కనిపించడం లేదు. అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి ఫొగాట్‌ కు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశామని కేంద్ర క్రీడల శాఖమంత్రి బుధవారం లోకసభలో చెప్పారు. భారతీయ ఒలింపిక్‌ సంఘానికి మాజీ పరుగుల రాణి పి.టి. ఉష అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమెను అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘంతో గట్టిగా పోరాడాలని ప్రధానమంత్రి మోదీ కూడా సూచించారట. ఇది నిజమే అయినా గత సంవత్సరం మోదీ ప్రభుత్వం మహిళా మల్ల యోధులతో వ్యవహరించిన తీరు, వారిని రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తీరు చూసిన వారు మాత్రం ఫొగాట్‌ అనర్హతలో ఏదో కుట్ర ఉందనే భావిస్తున్నారు. కానీ క్రీడా మంత్రి ఈ విషయం నిండు సభలో చెప్తున్నప్పుడు ఆమె మీద కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు చెప్పడం చూస్తే బీజేపీ కుట్ర ఉందేమోనన్న అనుమానాలు బలపడ్తున్నాయి. సదరు మంత్రి సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడడం విచిత్రం. ఫొగాట్‌ తీవ్ర నిరాశకు గురై ఉన్న దశలో, అసలు దేశం యావత్తు దిగ్భ్రాంతమై ఉన్నప్పుడు కేంద్రమంత్రి జమా ఖర్చులను ప్రస్తావించడం చీదర పుట్టిస్తోంది. క్రీడల మంత్రి ప్రస్తుత ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనడానికి, అంతకు ముందు ఎన్నిసార్లు ఎన్నేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందో చెప్పడం జుగుప్సాకరంగా ఉంది. ఫొగాట్‌ ఎదుర్కుంటున్న స్థితి గురించి సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ సైతం దు:ఖ భరితుడై ఉన్నప్పుడు ఈ లెక్కలు వివరించడానికి సదరు మంత్రికి నోరెలా వచ్చిందో. మంత్రులకు సంస్కారం ఉంటుందనుకోవడం భ్రమేనేమో! మహిళా కుస్తీ వీరులు గత ఏడాది నిరసన తెలియజేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ఒడిలో కూర్చోవడానికి అలవాటుపడ్డ మీడియా సంస్థలు కూడా ఇలాంటి లెక్కలే వెల్లడిరచాయని గుర్తుంచుకోవడం అప్రస్తుతం కాదు, అత్యవసరం.
ఫైనల్‌లో పాల్గొనడానికి ముందు రోజు రాత్రి కూడా ఫొగాట్‌ అనేక రకాల వ్యాయామాలు చేస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు ఒక రోజులోనే సెమీ ఫైనల్‌, ఫైనల్‌ కూడా ముగిసేవి. ఈసారి నియమాలు మార్చి రెండు రోజుల్లో నిర్వహించారు. ఒక రోజులో వంద గ్రాముల బరువు పెరగడం మూర్ఛ పోవలసినంత ఆశ్చర్యకరమైందేమీ కాదు. ఆమె మరింత వ్యాయామం చేయడానికి ఇంకొంత సమయం ఇవ్వాలన్న అభ్యర్థనను అంగీకరించలేదు. నియమాలు ఒక్కరి కోసం కాదు, అందరికోసం అన్న వాస్తవాన్ని అంగీకరించ వలసిందే. కానీ ఆమె బరువు పెరగడం వెనక కూడా ఏదో కుట్ర ఉందేమోనన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. రాత్రంతా వ్యాయామంవల్ల ఆమె ఒంట్లో నీరు తగ్గి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సాంకేతికంగాచూస్తే ఆమె ఫైనల్‌లో పాల్గొనలేకపోయారు. కానీ ఆమె ఈ ఒలింపిక్స్‌ లో అపూర్వమైన ప్రతిభ కనబరిచారు. ఫైనల్‌లో పాల్గొనలేక పోయినందుకు ఏ భారతీయుడూ చింతించడం లేదు. ఆమె చూపిన కౌశలాన్ని గుండె నిండా నింపుకుంటున్నారు. ఆమె మెడలో బంగారు పతకం ఉన్నట్టే ఊహించుకుంటున్నారు. ఇదే క్రీడా స్ఫూర్తి. గత ఏడాది తన అనుచరులతో కలిసి జంతర్‌ మంతర్‌లో చేసిన వీరోచిత పోరాటంలో ప్రభుత్వం ఆమెను ఓడిరచి ఉండొచ్చు. కానీ జనం దృష్టిలో ఆ మహిళా మల్ల యోధులందరూ జనం దృష్టిలో విజేతలుగానే మిగిలారు. అయితే ఆమె ఫైనల్‌లో పాల్గొనలేకపోవడం అభిమానుల గుండెల్లో ముల్లు గుచ్చుకున్నట్టు ఉండడం సహజమే. మామూలుగా వినేశ్‌ 55-56 కిలోల బరువు ఉంటారట. అందుకే ఆమె గత ఒలింపిక్స్‌లో బరువు తగ్గించుకుని 53 కిలోల పోటీలో పాల్గొన్నారు. ఈసారి 50 కిలోల పోటీలో సత్తా చూపించడం కోసం అవిశ్రాంతంగా కఠోరంగా శ్రమించారు. కానీ వంద గ్రాముల బరువు పెరగడంతో ఆమె ప్రయత్నాలన్నీ పనికి రాకుండా పోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img