Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

పోలీసు బందోబస్తు మధ్య మార్కెట్ వేలం పాట

–రూ.48.64 లక్షలకు పాట దక్కించుకున్న బాట వీరేష్
–రూ.13 లక్షలు తగ్గిన ఆదాయం.

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండలంలోని బిల్లేకల్లు దినసరి టమోటా, కూరగాయల మార్కెట్ వేలం పాటను బుధవారం పోలీసు బందోబస్తు మధ్య ఇన్చార్జి ఈవోఆర్డి రామ్మూర్తి ఆధ్వర్యంలో సర్పంచ్ శ్రీనివాసులు అధ్యక్షతన మార్కెట్ వేలం పాటలను ప్రశాంతంగా నిర్వహించారు. స్థానిక గ్రామచావిడి ఆవరణంలో నిర్వహించిన ఈ వేలం పాటలో ఇద్దరు పాటదారులు పాల్గొన్నారు. దినసరి టమోటా కూరగాయల మార్కెట్‌కు అధికారులు వేలంపాట నిర్వహించగా బాట వీరేష్ అనే వ్యక్తి రూ. 45,64,000 లక్షలతో మార్కెట్‌ను దక్కించుకున్నారు. బాట వీరేష్, గోవిందరాజులు మధ్య ముఖాముఖి గా జరిగిన పోటీలో బాట వీరేష్ రూ. 45 లక్షల 64 వేలకు వేలం పాటను దక్కించుకున్నాడు. గత సంవత్సరం రూ.58 లక్షల 70,750 వేలకు వేలం పాట పొగ.. ఈ సంవత్సరం రూ.45 లక్షల 64 వేలు వేలం పాటతో గత ఏడాది కంటే రూ.13 లక్షలు ఆదాయం తగ్గినట్లు ఇంచార్జి ఈఓఆర్డి రామ్మూర్తి, తెలిపారు. గత నెలలో మార్కెట్లో వేలం పాటలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య ఈ వేలంపాటలో నిర్వహించామని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంచాయతీకి ఆదాయం తగ్గినట్లు ఆయన తెలిపారు. గ్రామపంచాయతీ నిబంధన మేరకే వేలంపాటను దక్కించుకున్న కాంట్రాక్టర్ నడుచుకోవాలని అధికారులు సూచించారు. ఈ వేలంపాటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ మస్తాన్ వలి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును నిర్వహించారు. ఈ వేలంపాటలో డి ఎల్ పి ఓ కార్యాలయ సిబ్బంది రవికుమార్, పంచాయితీ కార్యదర్శులు లక్ష్మన్న, సునీల్, వీరేష్ సిబ్బంది ఖాజ, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, మాజీ ఎంపీపీ వెంకటేష్, గ్రామ పెద్దలు హనుమంతురెడ్డి, నాగరాజు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img