Free Porn
xbporn
https://www.bangspankxxx.com
voguerre
southampton escorts
Wednesday, September 25, 2024
Wednesday, September 25, 2024

క్లాప్ వెహికల్ డ్రైవర్ల జీతాలు జి. ఓ నెం 7 ప్రకారం చెల్లించాలి

ఎ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొరుమామిళ్ళ సుబ్బరాయుడు

విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఏ.పి. స్వచ్చాంద్ర క్లాప్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం ) ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం దగ్గర సామూహిక నిరసన ధర్నా చేశారు. మొదటి రోజు ధర్నా శిబిరాన్ని ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొరుమామిళ్ళ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ. రాష్ర్ర ప్రభుత్వం క్లిన్ ఆంధ్రప్రదేశ్ అని స్వచ్ఛసంకల్ప పథకంలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి భయంకరమైన రోగాలని సైతం లెక్కచేయక తడి చెత్త, పొడి చెత్తని సేకరించి క్లాప్ బళ్ళని నడుపుతున్న డ్రైవర్లు వారి బ్రతుకు బండిని మాత్రం నడపలేని స్థితిలో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ 7 ప్రకారం క్లాప్ డ్రైవర్లకి చెల్లించమని 18,500 ఇస్తున్న సొమ్ముని మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు కొంత మింగేస్తూ 10,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో ఎఐటియుసి పోరాట ఫలితంగా డ్రైవర్లకి 18,500 కనీస వేతనాల జీఓ 7 ని సాధించుకుంటే ఆ విషయం పై నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రాణాలకు తెగించి కష్టపడి పనులు చేస్తున్న డ్రైవర్ల శ్రమని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జీతానికి తగినట్టుగా పి.ఎఫ్ చెల్లింపులు జరగడం లేదన్నారు. అందులో జరుగుతున్న అవకతవకలను తక్షణమే అధికారులు జోక్యం చేసుకుని సరిచేయలన్నారు. పి.ఎఫ్ చెల్లింపుల్లో పెద్ద దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. డ్రైవర్లకి ప్రమాదం జరిగిన, ఏదయినా రోగం వచ్చిన వైద్యం చేయించుకోడానికి ఈఎస్ఐ అమలులో ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. నేటికి ఈఎస్ఐ కార్డులు ఇవ్వలేదన్నారు. వారానికి ఒక్క రోజు కూడా శెలవు లేకుండా శ్రమిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన డ్రైవర్లు మాకు న్యాయం చేయండి అని అడిగేవారిని కనీసం కనికారం, మానవత్వం లేకుండా విచక్షణారహితంగా ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మౌళికావసరాలైన వారంతపు సెలవులు, 8 జాతీయ మరియు 15 పండుగ సెలవులు, సంపాదిత సెలవులు, పనిగంటలు మొదలైన వాటికి నోచుకోలేదని అన్నారు. ఇస్తున్న వేతనాల్లో కోతలు విధించడం. ప్రతి నెలా సక్రమంగా జీతాలు వేయకపోవడం దారుణమన్నారు. ప్రతి నెల 5 వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కాంట్రాక్టు విధానం రద్దు చేసి మున్సిపల్ కార్మికుల వలే అప్కాస్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి శాంతియుత ఉద్యమం మొదలు పెట్టాము ఈ నెల 30 నుంచి సమ్మె పోరాటంలోకి వెళ్లనున్నామని తెలిపారు. ఉధృతం కాకముందే అధికారులు కలుగుచేసుకుని సమస్యలు పరిష్కరించి సామరస్య వాతావరణం కల్పించకపోతే తరువాత జరగబోయే పరిణామాలకు అధికారులు, కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి వస్తుందని సుబ్బరాయుడు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎ.పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ కల్యాణం అప్పలరాజు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్. రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు జలగడుగుల కామేష్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు లతో పాటు విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్లో 60 సచివాలయ పరిధిలో పని చేస్తున్న క్లాప్ వెహికల్ డ్రైవర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img