Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

పార్లమెంటు రద్దుకు కుట్ర

సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సంరీర్ణ ప్రభుత్వం రాజ్యాంగబద్దమైన హక్కులను కాలరాస్తూ చట్టవిరుద్దంగా ఆర్డినెన్స్‌ ద్వారా పార్లమెంటు రద్దు చేసి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కుట్రలు చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ‘వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌, వన్‌ ఓట్‌, వన్‌ ఎలక్షన్‌’ పేరుతో ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా సిపిఐ దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ హిమాయత్‌ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుంభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్‌.బాలమల్లేష్‌తో కలిసి నారాయణ మాట్లాడారు. అభివృద్ధి పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎక్స్‌ హైవే నిర్మాణాలకు సిపిఐ అభ్యంతరం చెప్పడం లేదని, అయితే అవి అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారాయణ డిమాండ్‌ చేశారు. ఎక్స్‌ హైవే నిర్మాణాలకు సిపిఐ అభ్యంతరం చెప్పడం లేదని, అయితే అవి అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారాయణ డిమాండ్‌ చేశారు. ఎక్స్‌ హైవేల నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను సేకరించి చివరికి వారికే దారి లేకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఇటీవలే చిత్తూరు జిల్లాలో రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తే నిర్మాణ సంస్థ తాత్కాలికంగా ఇరువైపుల రైతులకు దారి ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, ఇందుకు సంబంధించి కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరికి సిపిఐ తరుపున ఒక లేఖ రాసినట్లు నారాయణ తెలిపారు. కేంద్ర మంత్రికి రాసిన లేఖ ప్రతులను తెలంగాణ రాష్ట్ర సిఎం ఎ.రేవంత్‌, ఏపీ సిఎం చంద్రబాబుతో పాటు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ పంపించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని, అదేవిధంగా మూసీ ప్రక్షాళన సైతం చేయాల్సిందేనని నారాయణ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పేదలకు పునరావసం కల్పించిన తర్వాతే వారిని అక్కడి నుంచి ఖాలీ చేయించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చట్టబద్దంగా ఏ పని చేసినా సిపీఐ సమర్ధిస్తుందని, కానీ పునరావసం కల్పించకుండా వారిని తరలించడం సమంజసం కాదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img