Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఏ పనైనా సాధ్యమే

పెన్షన్ల పంపిణీని ఒక్క రోజులోనే 90 శాతానికి పైగా పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం తెదేపా

తెదేపా మండల అధ్యక్ష, ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రరావు, లక్ష్మణ్, సీనియర్ నాయకుడు మంగు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఏ పనైనా సాధ్యమే అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరూపించారని ఆ పార్టీ చింతపల్లి మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు కిలో పూర్ణచంద్రరావు, ఆండ్రాబు లక్ష్మణ్, సీనియర్ నాయకుడు గొల్లోరి మంగు అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే వాలంటీర్ వ్యవస్థ లేకున్నా సామాజిక పెన్షన్ ల పంపిణీని ఒక ట్రెండు రోజుల్లోనే ప్రహసనంలా పూర్తి చేయవచ్చునని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరూపించారన్నారు. వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించినప్పటికీ గడచిన ఐదేళ్లలో ఏనాడు ఐదు రోజులకు లోపు పెన్షన్ పంపిణీని పూర్తి చేయలేదన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి మునుపెన్నడూ కనీ, విని ఎరుగని రీతిలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడిన తరువాత తెలుగుదేశం ప్రభుత్వంలో పెంచిన పెన్షన్ 4 వేల రూపాయలతో పాటు గడచిన మూడు మాసాలకు సంబంధించిన మూడు వేల రూపాయలను కలిపి ఏడు వేల రూపాయలు చొప్పున ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి ఒక్క రోజులోనే అందజేసిన ఏకైక ప్రభుత్వం తెదేపా అన్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడు ఉంటే అన్నీ సాధ్యమేనని ఈ కార్యక్రమం ద్వారా రుజువైందన్నారు. మండలంలోని 17 పంచాయతీలకు సంబంధించి అత్యధికంగా పెద బరడ పంచాయతీ సచివాలయం పరిధిలో 789 మందికి, అదే క్రమంలో లోతుగెడ్డ లో 655, చింతపల్లి 1 సచివాలయంలో 512, అంజలి శనివారం 488, లంబసింగి 485, కొమ్మంగి 484, ఎర్రబొమ్మల 464, బలపం 460, బెన్నవరం 457, కిటుముల 455, గొందిపాకల 428, తాజంగి 2లో 417, తాజంగి లో 4005, చౌడుపల్లి 2లో 400, చౌడుపల్లి లో 370, అన్నవరంలో 370, కొత్తపాలెం లో 381, కుడుము సారీ లో 3 77, కొత్తపాలెం 2లో 330, తమ్మంగులలో 328, చింతపల్లి 2 లో 278, చింతపల్లి 3 సచివాలయంలో 218 మంది పెన్షన్ లబ్ధిదారులకు ఏకకాలంలో ఒక్కరోజులోనే 90 శాతానికి పైగా పెన్షన్ పంపిణీ చేసి చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. గడచిన వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అటువంటి నిరంకుశ వైకాపా ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పడం వలన నేడు పెన్షన్ పెంపుతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమపాళ్లలో అందించే ప్రభుత్వం ఏర్పడడం సంతోషదాయకమన్నారు. తెదేపా పరిపాలనలో రానున్న ఐదేళ్లు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img