Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

మన్యంలో భానుడి భగభగ… ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మన్యవాసులు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – వేసవికాలం ప్రారంభంలోనే భానుడు భగభగ లాడుతున్నాడు. ఆ ప్రభావంతో మన్యంలో సూర్య భగవానుడి ప్రకోపానికి ఈ ఏడాది మన్యవాసులు విలవిల లాడుతున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది మన్యంలో వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండడంతోపాటు, వడగాల్పులు వీస్తున్నాయి. నిత్యం శీతల వాతావరణానికి పేరెన్నిక గన్న ఆంధ్ర కశ్మీర్ లంబసింగి, తాజంగి ప్రాంతాలలోనూ రహదారి విస్తరణ పేరిట వృక్ష సంపదను తొలగించడంతో వేసవి ప్రారంభానికి ముందు నుంచే మన్య ప్రాంతాన్ని ఎండ వేడిమి ఆవరించింది. అది కాస్త వేసవికాలం ప్రారంభమయ్యే నాటికే మూడు పదుల మార్కు దాటి ప్రజలకు ముచ్చెమటలు (ఉక్క పోత) పోస్తుంది. మన్య ప్రాంత ప్రజలు మైదాన ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు సంసాయించే పరిస్థితులు నెలకొన్నాయి. తప్పనిసరి పరిస్థితులలోనే మన్యవాసులు ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మన్యంలోనూ ఉక్క పోతతో కూడిన చెమటలు పడుతున్నాయి. నిరంతరం త్రాగునీరు, మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరినీరు తదితర పానీయాలు త్రాగుతూ ప్రయాణాలు చేస్తున్నారు. మండుటెండల్లో సూర్యుడు తీవ్ర రూపంలో వడ గాల్పులతో విరుచుకుపడుతుండడంతో పానీయాల దుకాణాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయి. మన్యంలో ఏప్రిల్, మే మాసాలలో మాత్రమే అంతంత మాత్రంగా ఉండే ఎండలు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల నుండే భీకర రూపం దాల్చడంతో మన్యవాసులు విలవిలలాడుతున్నారు. దీనికి తోడు శనివారం చింతపల్లి, జికే వీధి మండలాలలో జంగిల్ క్లియరెన్స్ పేరిట ఉదయం 9 నుండి సాయంత్రం ఐదారు గంటల వరకు విద్యుత్ కోత విధించడంతో నీటి మోటార్లు, ఫ్యాన్లు వేసుకునే అవకాశం లేక మన్యవాసులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు లేకపోలేదని, ఈ దశలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేసి ప్రజలకు వేసవితాపం తగలకుండా ఉండేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img