Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

సంక్షేమ పథకాల సృష్టికర్త … ఆరోగ్య పథకాల ప్రదాత” వైయస్సార్”

వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసీ నివాళులర్పించిన వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సంక్షేమ పథకాల సృష్టికర్త… ఆరోగ్య పథకాల ప్రదాత మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైకాపా అల్లూరి జిల్లా అక్షరాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు.డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారం చింతపల్లి వచ్చిన ఆమె ఆ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్సార్ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలిలో గల వైయస్సార్ కాంస్య విగ్రహానికి స్థానిక ఎంపీపీ కోరాబీ అనూష దేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చింతపల్లితో వైఎస్ఆర్ కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గిరిజనులకు ఏ మాదిరిగా వైయస్సార్ అండగా నిలిచారో ఏ తరహా పాలన అందించారన్న విషయాన్ని గుర్తు చేస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదివాసీలంతా ఆరాధ్య దైవంగా కొలుస్తారన్నారు. వైయస్సార్ ఆశయ సాధన దిశగా ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడచిన ఐదేళ్లు రాజకీయ పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందించారన్నారు. భవిష్యత్తులో ఆయన నడిచిన బాటలోనే తామంతా నడుస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ చింతపల్లి మండల వైస్ ఎంపీపీలు గోపి నాయక శారద, సాగిన వెంగళరావు, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ పల్లి, మండల కన్వీనర్ పాంగి గుణ బాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెల్లీ సుధాకర్ , వ్యవసాయ మార్కెట్ కమిటీ హాజీ చైర్ పర్సన్ జల్లి హలియా రాణి, .మండలంలోని వివిధ పంచాయతీల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img