Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

వ్యాధులు ప్రబలకుండా స్ప్రేయింగ్

ఇంకుడు గుంతలలో నిలువ నీటిని పరిష్కరిద్దాం..

మలేరియా సబ్ యూనిట్ అధికారి కన్నబాబు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్య ప్రాంతంలోనూ మైదాన ప్రాంతానికి దీటుగా ఎండలు మండుతున్న నేపథ్యంలో గడచిన నాలుగు రోజులుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్ర ప్రతాపం చూపిస్తున్నప్పటికీ, మధ్యాహ్ననికి ఆకాశం మేఘావృతమై కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ ముందు జాగ్రత్తగా మన్య ప్రాంతంలో స్ప్రేయింగ్ కార్యక్రమం నిర్వహిస్తుంది. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఆదేశాల మేరకు మన్య ప్రాంతంలో దోమల ముందు పిచికారి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మలేరియా సబ్ యూనిట్ అధికారి ఆర్ కన్నబాబు అన్నారు. ఆర్వి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంపీహెచ్ ఈవో జాన్సన్ ఆధ్వర్యంలో మంగళవారం చింతపల్లి-3 సచివాలయం పరిధిలోనీ పెంటపాడు, బుడతలవేనం గ్రామాలలో దోమల ముందు పిచికారి పనులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యంలో ఒకవైపు ఎండలు మండుతుండగా మరోవైపు చెదురుమదురు వర్షాలు పడుతున్న నేపథ్యంలో చిన్నపాటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ఏమాత్రం చిన్నపాటి నీరసంగా ఉన్నా, జ్వరాలు, దగ్గు జలుబు తదితర రుగ్మతలు ప్రబలిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలని ఆయన సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చి మొక్కలు, మురుగు కాలువలను తొలగించుకోవాలన్నారు. పిచ్చి మొక్కలు మురుగు కాలువల వలన దోమలు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని వాటి వల్ల మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్, డయేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడి పదార్థాలను మాత్రమే భుజించాలని సూచించారు. ఎండ వేడితో పాటు మామిడిపళ్ళ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఆరోగ్య సంరక్షకురాలు (ఏఎన్ఎం) కోపూరు విజయలక్ష్మి, మలేరియా టెక్నికల్ అసిస్టెంట్ శ్రావణి సంధ్య, హెల్త్ అసిస్టెంట్ కూడా ప్రకాష్, ఆశా కార్యకర్తలు కంకిపాటి రాజేశ్వరి, గుంట సంధ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img