Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంపై జిల్లా పరిషత్ డి.పి.ఆర్.సి మీటింగ్ హాల్ లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈవో మాట్లాడుతూ విశ్వకర్మ పథకం ముఖ్య ఉద్దేశం వృత్తి పనులు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకంఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 రకాలైన కుల వృత్తుల వారిని గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయము ఉంటుందని, వడ్డీ 5 శాతం మాత్రమే ఉంటుందన్నారు. అర్హత గల వారంతా విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఔత్సహికులకు వారివారి నైపుణ్యాన్ని గుర్తించి తగు శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
ఈ అవగాహనా కార్యాక్రమాన్ని నిర్వహించిన యం.ఎస్.యం.ఇ డిఐ అసిస్టెంట్ డైరెక్టర్ డి.వి.ఎస్.ఆర్. మూర్తి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈ పథకానికి 13 వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసారని మరియు ఈ పథకం 2028 వ సంవత్సరము వరకు కొనసాగుతుందన్నారు. కావున జిల్లాలోని 18 రకాల చేతి వృత్తులవారు మరియు అర్హులు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బి.సి. కార్పొరేషన్, బ్యాంకు సిబ్బంది, జిల్లా పరిశ్రమల శాఖ సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img