Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

మే 8న ఏపీ ఈసెట్ పరీక్ష

15 నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదు..

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: ఏపీ ఈసెట్ పరీక్ష మే 8న పరీక్ష నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్ ,వీసి జివిఆర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. గురువారం పరిపాలన భవనంలో సెమినార్ హాల్లో ఏపీ ఈసెట్ పరీక్ష పై చైర్మన్, కన్వీనర్ ఆచార్య పి ఆర్ భానుమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్, ఓటిపిఆర్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. డిప్లమా , బిఎస్సి (గణితం) పాసైన విద్యార్థులు.. బీటెక్ , బీఫార్మసీ కోర్సులలో రెండో సంవత్సరం ప్రవేశానికి సెట్ పరీక్ష జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం) ఉన్నత విద్యా మండలి అప్పగించింది అన్నారు. పరీక్ష మొత్తం 14 విభాగాల్లో పరీక్ష చేపడుతున్నట్లు.. ఏపీ తో పాటు హైదరాబాదులో కూడా పరీక్ష కేంద్రం ఉంటుందన్నారు. మార్చి 15 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై. ఏప్రిల్ 15న ముగుస్తుందన్నారు.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, 2000తో 29 ఏప్రిల్, మే 5న 5000 రూపాయలు అపరాధ రుస్తుంతో దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటును కల్పించామన్నారు. పరీక్ష రెండు సెషన్ లు. మొదటి స్పెషల్ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. మే 1న విద్యార్థులు హాల్ టికెట్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. పరీక్ష పై పట్టు సాధించేందుకు వెబ్సైట్లో ఆన్లైన్ పరీక్ష ఉంటుందని అభ్యర్థులు వారి సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చు అన్నారు. పరీక్ష ఫలితాల కి విడుదల మే 10 న వెల్లడిస్తామన్నారు. మే 12న ప్రాథమిక కి అభ్యంతరాల స్వీకరణ చేపడతామన్నారు.
ఒక్క నిమిషం ఆలస్యమైన నిరాకరణ..
పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిని నిరాకరిస్తామన్నారు. విద్యార్థులు ముందస్తుగా పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందే చేరుకోవాలని విద్యార్థులకు చైర్మన్ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img