Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

రైతులకు పెట్టుబడి సాయాన్ని తెలంగాణను చూసి ఏపీ నేర్చుకోవాలి..

ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్

ఆగస్టు 7న విజయవాడలో మహాధర్నా

విశాలాంధ్ర- బుక్కరాయసముద్రం: రైతన్నలకు పెట్టుబడి సాయం పదివేల రూపాయలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఏపీ నేర్చుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం పట్టణంలో రైతుల సమస్యల పరిష్కారం పై కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. రైతు భరోసా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కలుపుకొని 13500 ఇస్తూ రైతులను మోసగించుతూ ఉన్నారన్నారు. పంటల బీమా పరిహారం.. పరిహాసంగా మారింది కానీ నష్టపోయిన రైతును ఆదుకోవాలని కనీస మానవీయత విలువలను మరిచిన సీఎం జగన్ మరిచారన్నారు. జూలై వచ్చిన వర్షాలు సకాలంలో రాక వర్షం కోసం ఎదురుచూస్తూ పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. నష్టపోయిన ప్రతి రైతుకు 2022 పంటల బీమా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 7న విజయవాడలోరైతుల ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. అన్నదాతను ప్రభుత్వం ఆదుకోకపోతే సీఎం ముక్కును నేలకు తాకించేంతవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఆకాశాన్ని అంటుతున్న మిరప, టమోటా, నిత్యవసర వస్తువులు ధరలను చూసి సామాన్య మానవుడు ఉపవాసాలు ఉండే పరిస్థితి నెలకొన్నది అన్నారు. కేంద్రంలో మోడీ ,రాష్ట్రంలో సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరితో పంటలకు కనీస మద్దతు ధర, పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా మోసగిస్తున్నారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులతో రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తూ ఉందన్నారు. సీఎం జగన్ బటన్ నొక్కారు కానీ.. నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా పరిహారం మాత్రం రాలేదన్నారు. పంటలు నష్టపై సర్వస్తము కోల్పోయి… పట్టణాలకు వలస వెళ్లే బ్రతుకు జీవనం సాగించే పరిస్థితి వచ్చింది అన్నారు. ప్రభుత్వం పంటలకు ఇచ్చే పరిహారం బీమా గోరంత సాయం కొండంత ప్రచారం చేసుకుంటున్నారు అన్నారు. కన్నీరు పెడుతున్న అన్నదాతను చేయూతను ఇచ్చే సాయాన్ని మరిచారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రైతు సంఘం సి. మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి డి చిన్నప్ప యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img