Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి ఏర్పాట్లు చేపట్టాలి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి మహోత్సవాల కోసం ఈనెల 10వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మండలంలోని సేవాగడ్ లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి మహోత్సవాల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిడబ్ల్యుఓ మాట్లాడుతూ గుత్తి మండలంలోని చెర్లోపల్లి పంచాయతీ సేవాగడ్ లో ఈనెల 13, 14, 15వ తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జయంతి మహోత్సవాలకు వచ్చే ముఖ్య అతిథులకు, ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాగడ్ ట్రస్ట్ సభ్యులు కేశవనాయక్, జగన్నాథ రావు, రవీంద్ర నాయక్, సేవాగడ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మరియు టిటిడి బోర్డు సభ్యుడు అశ్వత్తనాయక్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్పీడీసీఎల్, పంచాయతీరాజ్ డిఈలు, పోలీస్, ఫైర్, మెడికల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img