Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలి

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం ఫిబ్రవరి 9వ తేదీన నిర్వహించాలని, జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం రోజులలో డీ వార్మింగ్ చేయబడని పిల్లలకు ఫిబ్రవరి 16వ తేదీలో జరిగే మాప్ -అప్ రోజులో అల్బెండజోల్ 400 మిల్లి గ్రాముల మాత్రను వేయాలన్నారు. పిల్లలు, కిషోర్ బాలల కడుపులో నులి పురుగులు ఉన్నట్లయితే పోషకాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని, శారీరక మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారన్నారు. జిల్లాలోని 1,194 ప్రాథమిక పాఠశాలలు, 194 ప్రభుత్వ యూపీ స్కూల్స్, 358 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, 2,302 అంగన్వాడి కేంద్రాల్లో, ప్రైవేట్ ప్రాథమిక, యుపి, ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలు, ఐటిఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్ నర్సింగ్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లోని 5,64,324 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. ఉచితంగా అందించే అల్బెండజోల్ 400 మిల్లి గ్రాముల మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ప్రాజెక్ట్ ఆఫీసర్ జి.నారాయణస్వామి, డిప్యూటీ కలెక్టర్లు నీలమయ్య, రవీంద్ర, ఆనంద్, ఆర్బిఎస్కే మేనేజర్ డి.రజిత, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img