Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ప్రపంచ గమ్యాన్ని మార్చేది ఇంజనీరింగ్

విశాలాంధ్ర -జె ఎన్ టి యుఏ : ప్రపంచ గమ్యాన్ని మార్చేది ఇంజనీరింగ్ విద్యార్థులే అని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వీసి జి.వి. ఆర్. శ్రీనివాస రావు పేర్కొన్నారు. శుక్రవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల 16 వ వార్షికోత్సవ వేడుకలు ,కళాశాల చైర్మన్ ఎం. అనంత రాముడు పుట్టినరోజు పురస్కరించుకొని వీసి,ఐ ఆర్ ఎస్ నరసింహప్ప, కుటుంబ సభ్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో కేక్ కట్ చేసి గణమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ.. రైతు కుటుంబంలో పుట్టి అంచలంచలగా ఎదిగి పండ్ల తోటల పెంపకంలో ఘన విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.సామాజిక బాధ్యతలను అలవరచుకొని వంద మందిలో ఒక్కరిగా కాకుండా వంద మందికి ఒక్కడిగా, వ్యవస్థాపకులుగా ఎదగాలని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ ఏం అనంత రాముడు మాట్లాడుతూ.. విద్యార్థుల కలల స్వప్నాన్ని నెరవేరుస్తూ.. ఉజ్వల భవితికి కళాశాల నిరంతరం కృషి చేస్తూ ఉందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు సాధించి విజయ శిఖరాలను అధిరోహించడం పట్ల నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. డైరెక్టర్ రమేష్ నాయుడు .. నూతన విద్యా విధానం, సాంకేతిక పురోగతి , నైపుణ్య ప్రమాణాలను, పోటీ ప్రపంచం తగ్గట్టుగా విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నామన్నారు. విద్యార్థుల వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో .ప్రిన్సిపల్ డా . డా ఎం. మూర్తి , నైపుణ్యాభివృద్ది సంచాలకులు డా. ఎం. సురేంద్ర నాయుడు , విభాగాధిపతులు, అద్యాపకులు , విద్యార్ధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img